పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.స్కూల్ వ్యానును ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఢీకొట్టింది.
ఈ ఘటన పాలకొల్లు మండలం పూలపల్లిలో చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో స్కూల్ వ్యాను క్లీనర్ తో పాటు పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయని తెలుస్తోంది.
కాగా ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 42 మంది చిన్నారులు ఉన్నారని సమాచారం.వెంటనే గమనించిన స్థానికులు బాధిత విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
అయితే ప్రాణనష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.మరోవైపు రోడ్డుప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.