మూడు రాష్ట్రాలలో పోటీ అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన..!!

నేడు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం తెలిసిందే.తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు నవంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేశారు.

 Competition In Three States Arvind Kejriwal Key Announcement , Aap, Arvind Kejri-TeluguStop.com

డిసెంబర్ మూడవ తారీకు నాడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.మిజోరాం, చత్తిస్ గాడ్ రాష్ట్రాలలో విడతల వారీగా ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఇదిలా ఉంటే ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) కీలక ప్రకటన చేశారు.మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పూర్తిస్థాయిలో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఇదే సమయంలో ఆ రాష్ట్రాలలో ఆమ్ ఆద్మీ పార్టీ( Aam Aadmi Party ) నుండి పోటీ చేసే అభ్యర్థుల లిస్టు కూడా విడుదల చేయబోతున్నట్లు పేర్కొన్నారు.ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు ఒంటరిగా పోటీ చేస్తారా లేదా ఇండియా కూటమితో కలసి.

పోటీకి చేస్తారా.అని ప్రశ్నించగా ఏదైనా త్వరలోనే నిర్ణయం తీసుకుని స్పష్టం చేస్తామని సమాధానం ఇచ్చారు.

ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్( Delhi, Punjab ) రాష్ట్రాలలో అధికారంలో ఉంది.ఇదే సమయంలో మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు దూసుకుపోతున్నారు.

అంతేకాకుండా ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించి పలు హామీలు కూడా ప్రకటన చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube