Prabhas Krishnam Raju : ప్రభాస్ కే ఫోన్ చేసి నరికేస్తా అంటూ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారా…. అసలేం జరిగిందంటే?

బాహుబలి ( Baahubali )సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈశ్వర్ సినిమా ద్వారా ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీకి కృష్ణంరాజు వారసుడిగా పరిచయం అయ్యారు.

 That Politician Give Strong Warning To Prabhas-TeluguStop.com

ఇలా ఈశ్వర్ సినిమా ద్వారా తన నటనతో అందరిని మెప్పించినటువంటి ప్రభాస్ అనంతరం పలు సినిమా అవకాశాలను అందుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగారు.

Telugu Salaar, Baahubali, Krishnam Raju, Pilitician, Prabhas, Med, Tollywood-Mov

ఇలా టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ గా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ప్రభాస్ ( Prabhas ) రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో బాహుబలి సినిమాలో నటించారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా ప్రస్తుతం ఈయన నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.ఇకపోతే త్వరలోనే ప్రభాస్ సలార్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ప్రభాస్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రభాస్ ఎలాంటి గొడవలకు వెళ్లరు ఆయన పనులు ఆయన చేసుకుంటూ వెళ్తారు అలాంటి ప్రభాస్ కి ఒక రాజకీయ నాయకుడు తల నరికేస్తా అంటూ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారట మరి ప్రభాస్ కి వార్నింగ్ ఎందుకు ఇచ్చారు ఏంటి అనే విషయానికి వస్తే.

ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు రాజకీయాలలో ఎంపీగా కొనసాగిన విషయం మనకు తెలిసిందే.

Telugu Salaar, Baahubali, Krishnam Raju, Pilitician, Prabhas, Med, Tollywood-Mov

అయితే ఒకానొక రాజకీయ ఎన్నికల సమయంలో ప్రభాస్ తరపున ఈయన పోటీకి దిగబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి ఇలా ప్రభాస్ పోటీలోకి దిగబోతున్నారన్న వార్త వైరల్ గా మారడంతో ప్రధాన ప్రతిపక్ష నేత ప్రభాస్ కి ఫోన్ చేసి నువ్వు సినిమాలు చేసుకుంటున్నావు చేసుకో కానీ రాజకీయాలు నీకెందుకు రాజకీయాలలోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా నరికేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారట.

Telugu Salaar, Baahubali, Krishnam Raju, Pilitician, Prabhas, Med, Tollywood-Mov

ఈ విధంగా ఆ పొలిటీషియన్ ప్రభాస్ కి వార్నింగ్ ఇవ్వడంతో ప్రభాస్ తనకు రాజకీయాలు అంటే పెద్దగా ఆసక్తి లేదు నేను రాజకీయాలలోకి రాను అంటూ చెప్పారట అయితే ఈ విషయాలన్నీ నీకు భయపడే చెప్పడం లేదు మీరు అనుకున్నట్టు నాకు నిజంగానే రాజకీయాల్లోకి రావాలని ఏమీ లేదు అంటూ ప్రభాస్ కూడా తన స్టైల్ లోనే వారికి వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube