పరమశివుని కుమారుడైన వినాయకుడు( Vinayakudu ) బాద్ర మాసంలోని శుక్లపక్షం చతుర్థి రోజున పుట్టాడని సన్నతన శాస్త్రాలలో ఉంది అందుకే ఈ రోజు నుంచి అనంత చతుర్దశి తిధి వరకు వినాయకుడిని పూజించి ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు.దీని ప్రకారం ఈ సంవత్సరం సెప్టెంబర్ 28 అనంత చతుర్దశిని జరుపుకుంటున్నారు.
ఈ రోజు విష్ణుమూర్తిని పూజిస్తారు.అంతే కాకుండా వినాయక నిమజ్జనం కూడా చేస్తారు.
భద్ర మాసంలోని శుక్లపక్ష చతుర్థి రోజున వినాయకుడు భూమి మీదకు వచ్చాడని పురాతన గ్రంధాలలో ఉంది.
అందుకే ఈ రోజు నుంచి అనంత చతుర్థి తిథి వరకు వినాయకుడిని పూజిస్తారు.మరి వినాయకుడిని ఏ సమయంలో నిమజ్జనం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే భద్రపద మాసంలోనీ చతుర్దశి తిధి సెప్టెంబర్ 27న రాత్రి పది గంటల 18 నిమిషాల నుంచి సెప్టెంబర్ 28 సాయంత్రం 6:30 నిమిషముల వరకు సమయం ఉంటుంది.ఈ రోజు మీరు ఏ సమయంలోనైనా విష్ణువును, వినాయకుడిని పూజించవచ్చు.దీని వల్ల మీ బాధలన్నీ తొలగిపోతాయి.అంతే కాకుండా అనంత చతుర్దశి రోజు వినాయకుని నిమజ్జనానికి( Vinayaka Nimajjanam ) మంచి సమయం ఉదయం 6 గంటల 12 నిమిషాల నుంచి ఏడు గంటల 42 నిమిషముల వరకు ఉంటుంది.
ఆ తర్వాత సమయం ఉదయం 10 గంటల 42 నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల 11 నిమిషాల వరకు ఉంటుంది.ఈ సమయంలో వినక విగ్రహాన్ని నిమజ్జనం చేయవచ్చు.అనంత చతుర్దశి తిది రోజు రాహుకాలం మధ్యాహ్నం 1:42 నిమిషాల నుంచి మూడు గంటల పదకొండు నిమిషముల వరకు ఉంటుంది.ఇంకా చెప్పాలంటే వినాయకుడిని నిమజ్జనం శుభ సమయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది.ఈ సమయంలో వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయవచ్చు.
అలాగే అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:42 నిమిషముల వరకు బహిరంగ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఉంటుంది.ఈ సమయంలో బహిరంగ ప్రదేశాలలో ప్రతిష్టించిన వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసుకోవచ్చు.
LATEST NEWS - TELUGU