ఎమ్మెల్సీ తిరస్కరణ అంశంపై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:ఎమ్మెల్సీల తిరస్కరణపై గవర్నర్ తమిల్ సై( Governor Tamil Sy ) చెబుతున్న సాకులు గురువింద సామేతను గుర్తుకు తెస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ తప్పుడు నిర్ణయం తీసుకుని సెల్ఫ్ గోల్ చేసుకుందని, గవర్నర్ అయ్యే సమయానికి ఆమె బీజేపీ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారని, ప్రకటన తరవాత రాజీనామా చేసిన గవర్నర్ నేడు నిష్పక్షపాత నిర్ణయాలు తీసుకుంటాననడం సరైనది కాదన్నారు.

 Minister Jagdish Reddy Responded On The Issue Of Mlc Rejection , Mlc Rejection,-TeluguStop.com

బీజేపీ నుండి గవర్నర్ గా వచ్చి ఎదుటి వారిని పార్టీ పేరుతో తిరస్కరించడం సమంజసం కాదన్నారు.గవర్నర్ తీరు గురువింద తీరుని తలపిస్తుందని,గవర్నర్ చెప్పే లెక్క ఆమెకూ వర్తిస్తుందని,తిరస్కరణ నీతితో ఆమె కూడా గవర్నర్ పదవికి అర్హురాలు కాకుండా పోతుందన్నారు.

నీతులు చెప్పే గవర్నర్ నైతిక విలువలు పాటిస్తారని ఆశిస్తున్నామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube