టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి జగపతిబాబు( Jagapathi Babu ) ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి హీరోగా కాకుండా విలన్ పాత్రలలోనూ సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి జగపతిబాబు ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇకపోతే జగపతిబాబు ఏ విషయాన్ని అయినా చాలా ముక్కు సూటిగా మాట్లాడతారు అనే సంగతి మనకు తెలిసిందే.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ప్రస్తుత జనరేషన్లో ఉన్నటువంటి పిల్లల మనస్తత్వాలు ప్రేమ పెళ్లిళ్ల గురించి ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సందర్భంగా ప్రస్తుత జనరేషన్లోని పిల్లలకు ప్రేమ అన్న పెళ్లి అన్న కూడా ఏమాత్రం గౌరవం లేదని వాటి విలువ తెలియడం లేదని తెలియజేశారు.ప్రస్తుత కాలంలోని పిల్లలకు ప్రేమ ( Love ) అంటే ఒక సరదా అని ఈయన వ్యాఖ్యానించారు.
ఇలా సరదాగా ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం జరుగుతుంది అయితే పెళ్లి అయిన కొద్ది రోజులకే విడాకులు( Divorce ) తీసుకుని విడిపోతున్నారని తెలిపారు.
ఇలా పెళ్లి చేసుకుని విడాకులు తీసుకొని విడిపోవగానే ఒక పని అయిపోయింది అని భావించి చాలామంది పార్టీలు చేసుకుంటున్నారని తెలిపారు.అందుకే ప్రస్తుత జనరేషన్ వారికి నేను ఇచ్చే సలహా ఒకటే ఎవరు కూడా పెళ్లిళ్లు చేసుకోవద్దు అంటూ ఈయన తెలిపారు.అయితే జగపతిబాబుకి ఇద్దరు కుమార్తెలు ఉన్న విషయం మనకు తెలిసిందే.
వీరి పెద్ద కుమార్తెకి ఇప్పటికే పెళ్లి జరిగింది కానీ రెండవ కుమార్తెకు మాత్రం తాను పెళ్లి చేసుకోవద్దు అని సలహా ఇస్తాను ఆ తర్వాత చేసుకోవడం చేసుకోకపోవడం తన ఇష్టం అంటూ జగపతిబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.