ఎస్బీఐ అదిరిపోయే ఆఫర్... 1 + 1 లోన్ ఆఫర్!

దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయినటువంటి ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తాజాగా ఓ శుభవార్త అందించింది.అవును, తమ వినియోగదారులకు ఓ చల్లని కబురు అందించింది.

 Sbi To Bundle Home Loans With Rooftop Solar Installations,sbi,green Funding,roo-TeluguStop.com

మరీ ముఖ్యంగా సొంతింటి కల సాకారం చూసుకోవాలని భావించే వారికి ఈ గుడ్ న్యూస్ తీసుకు వచ్చిందని చెప్పుకోవచ్చు.ఈ సందర్బంగా ఎస్బీఐ నుంచి హోమ్ లోన్ పొందాలని భావించే వారికి మరో ఆప్షన్ కూడా అందబాటులోకి తీసుకు వచ్చింది.

గ్రీన్ ఫండింగ్లో భాగంగా ఎస్బీఐ తన హోమ్ లోన్ కస్టమర్లకు రూఫ్టాప్ సోలార్ ఇన్స్టాలేషన్స్( Rooftop Solar Installations ) కూడా అంచాలని యోచిస్తోంది.

స్టేట్ బ్యాంక్ నుంచి హోమ్ లోన్( SBI Home Loans ) పొందాలని భావించే వారికి కచ్చితంగా ఈ రూఫ్టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ తప్పనిసరి చేయాలనే యోచనలో ఎస్బీఐ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు దీన్ని వర్తింపజేయాలని కూడా ఎస్బీఐ ఆలోచన చేస్తుండడం విశేషం.ఎస్బీఐ హోమ్ లోన్ బుక్ జూన్ నాటికి ఏకంగా రూ.6.3 లక్షల కోట్లకు పైనే వుండడం కొసమెరుపు.అలాగే వరల్డ్ బ్యంక్, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, కేఎఫ్డబ్ల్యూ ఆఫ్ జర్మనీ వంటి పలు మల్టీలేటరల్ లెండర్ల నుంచి ఎస్బీఐ తీసుకున్న ఫారెన్స్ లోన్స్ 2.3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

కాగా ఈ విషయమై ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్( SBI MD Ashwini Kumar Tewari ) అయినటువంటి అశ్విని కుమార్ తివారీ మాట్లాడుతూ… బిల్డర్లకు రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్స్ను తప్పనిసరి చేయాలనే యోచనలో ఉన్నామని, గ్రీన్ ఫండ్స్ నుంచి లోన్ పొందే ప్రాజెక్టులకు దీన్ని వర్తింపజేయాలనే ప్లానింగ్లో ఉన్నామని చెప్పుకొచ్చారు.అలాగే రానున్న కాలంలో హోమ్ లోన్ గ్రహీతలకు కూడా ఈ బండిల్డ్ డీల్ అందించే యోచనలో ఉన్నామని కూడా ఆయన ఈ సందర్బంగా వెల్లడించడం గమనార్హం.సిడ్జి గ్లోబల్ ఎస్ఎంఈ సమిట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.అలాగే ఎస్బీఐ పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆయన వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube