జనసేనలో ఉద్వేగం చల్లారినట్టేనా ?

ఏటువంటి ముందస్తు చర్చలు, సమావేశాలు లేకుండా ఒక్కసారిగా జనసేన అదినేత పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) పొత్తు ప్రకటించడంతో జనసైనికులలో చేలరేగిన ఉద్వేగం జనసేన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం తర్వాత చల్లారినట్టేనా అంటే అవుననే సమాధానం వస్తుంది .ముఖ్యంగా పవన్ తొందర పడ్డారని, గత పది సంవత్సరాలుగా పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేస్తున్న జనసైనికులకు, వీర మహిళలకు కనీస సమాచారం ఇవ్వకుండా పొత్తులు ప్రకటించడంతో చాలా మంది నిరుత్సాహానికి గురయ్యారు .

 Janasena Pawan Kalyan Meeting With Janasena Leaders At Mangalagiri Party Office,-TeluguStop.com

సీట్ల సర్దుబాటు గాని ముఖ్యమంత్రి పదవి గురించి గానీ, అదికారం లో తమ వాటా గురించి కానీ ఎటువంటి చర్చలు జరగకుండా బేషరతుగా మద్దతు ప్రకటించడంతో జనసేన కేడర్ నిరాశకు గురి అయింది.అయితే మంగళగిరి కేంద్ర కార్యాలయం( Mangalagiri Party Office )లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ జనసైనికుల మదిలో ఉన్న ప్రశ్నలు అన్నిటికీ సవివరంగా సమాధానం ఇచ్చేశారు .పొత్తు ప్రకటించడానికి దారి తీసిన సందర్భాన్ని, పరిస్థితులను కూలంకషంగా వివరించిన పవన్ సుదీర్ఘంగా ప్రసంగించి జనసైనికులకు బరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు .

Telugu Ap, Janasena, Mangalagiri, Pawan Kalyan, Tdpjanasena, Ys Jagan-Telugu Pol

గత పది సంవత్సరాలుగా పార్టీని నడుపుతున్న తనకు భవిష్యత్తు రాజకీయం పట్ల స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయని, తాను పార్టీ మొదలు పెట్టినప్పుడు మీరు ఎవరూ లేరని అలాంటి పరిస్థితి లో కూడా ఇంతవరకూ పార్టీని తీసుకొచ్చిన తనకు ఎలా ముందుకు తీసుకు వెళ్లాలో తెలియదా అంటూ జన సైనికులకు( Janasena Leaders ) సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.వచ్చే 2024 ఎన్నికల్లో జనసేన అసెంబ్లీలోనూ పార్లమెంట్ లోను బలంగా నిలబడుతుందని, ఎన్ని సీట్లు? ఎక్కడ పోటీ? రాజు ఎవరు మంత్రి ఎవరు అన్నది ఇప్పుడు ప్రశ్న కాదని, అన్ని వ్యవస్థలను తన ఇష్టరాజ్యంగా నాశనం చేస్తూ ఒక నియంత మాదిరిగా నిలబడిన జగన్( YS Jagan ) ను ఓడించడమే ఇప్పుడు ప్రధమ లక్ష్యమని రాజేవరో, మంత్రి ఎవరో ఎన్నికల తర్వాత చూసుకోవచ్చని, అయితే ఎవరి ప్రయోజనాల కోసం జనసేన రాజీ పడదు అని కచ్చితంగా జనసేన రాజ్యాధికారం సాధించి తీరుతుంది అంటూ ఆయన స్పష్టం చేశారు.

Telugu Ap, Janasena, Mangalagiri, Pawan Kalyan, Tdpjanasena, Ys Jagan-Telugu Pol

రాజకీయాలకు ఎప్పుడూ అంతిమ లక్ష్యం ప్రజా శ్రేయస్సే అయ్యి ఉండాలని, అధికారమన్నది అదే వచ్చి తీరుతుందని, అలాగే అర్హతకు మించి ఆశ పడకూడదు అంటూ కార్యకర్తలకు నాయకులకు వాస్తవాన్ని బోధించే ప్రయత్నం చేశారు .మన బలం ఎంత? బలహీనతలేమిటి అన్న విషయాన్ని రాజకీయంలో ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలని, సందర్భం వచ్చింది కదా అని తామే పై చేయిగా ఉన్నామంటూ మిగతా భాగస్వామ్య పక్షాన్ని హేళన చేయవద్దని ,ఎప్పుడూ ఏ రాజకీయ పక్షాన్ని తక్కువ అంచనా వేయకూడదని తాను ఎన్డీఏ బాగస్వామి గా ఉన్నా కూడా రాహుల్ రాజకీయపట్టుదలను తక్కువగా చూడనని ఆయన దేశం మొత్తం పాదయాత్ర చేసి బలపడ్డారని వ్యాఖ్యానించారు.పొత్తు పై తాను చేసిన ప్రకటనపై గందరగోళంలో పడిన శ్రేణులకు తాను సరయిన ట్రాక్ లోనే వెళుతున్నట్లుగా సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు పవన్ .మరి దీనిపై జనసైనికుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube