చైనా సరస్సులో కనిపించిన మిస్టీరియస్ జీవి.. 50 అడుగుల పొడవైన దాన్ని చూసి!

సాధారణంగా నీళ్లల్లో ఎన్నో వింత జీవులు కనిపిస్తుంటాయి.మామూలుగా సముద్రాల లోతుల్లో ఇవి ప్రత్యక్షమవుతుంటాయి.

 Mysterious Creature Found In China Lake See It 50 Feet Long , Tourist, China, Vi-TeluguStop.com

అయితే చైనాలో( China ) ఒక లోతైన సరస్సులో తాజాగా ఓ వింత జీవి కనపడింది.చైనాలోని ఓ టూరిస్ట్ టియాంచి సరస్సులో ఈ మిస్టీరియస్ జీవిని వీడియో తీశారు.

ఈ జీవి దాదాపు 50 అడుగుల పొడవు ఉంది.ఇది నీటి ఉపరితలాన్ని మొత్తం కదిలిస్తూ అలలు సృష్టించింది కాబట్టి, ఇది ఒక పెద్ద జంతువు అని తెలుస్తోంది.

ఇది చాలా చురుగ్గా కదులుతోంది, దీనిబట్టి చేప కాదని అర్థం అవుతోంది.ఇది సిల్వర్ రంగులో ఉంది, చేప లేదా క్షీరదం ఈ రంగులో ఉండవు.

మొత్తం మీద ఇదొక కొత్త జాతి జంతువుగా ఉండే అవకాశం ఉంది.

పార్క్ సిబ్బంది ఈ జీవిని గుర్తించలేకపోయారని, అయితే గతంలో కూడా ఇలాంటి దృశ్యాలు నమోదయ్యాయని లోకల్ మీడియా తెలిపింది.2020లో పార్క్‌లోని ఒక కార్మికుడికి సరస్సు ఉపరితలంపై నల్లటి వస్తువు తేలుతూ కనిపించింది.అతను ఇంతకుముందు ఇలాంటి దృశ్యాలను ఫిషింగ్ బోట్లు అని కొట్టిపారేశాడు, కానీ అతను వాటిని వివరించలేకపోయాడు.

సరస్సులో నిజంగా ఒక జీవి ఉందని తాము భావిస్తున్నామని, అయితే కచ్చితంగా చెప్పడం కష్టమని స్థానిక అధికారులు తెలిపారు.సరస్సులో తెలిసిన చేపలు ఏవీ పెద్దగా లేవని వారు గుర్తించారు.టియాంచి సరస్సు చైనా – ఉత్తర కొరియా మధ్య ఉన్న లోతైన సరస్సు.ఇది తరచుగా లోచ్ నెస్‌ అనే సరస్సుతో పోల్చబడుతుంది, ఇది లోచ్ నెస్ రాక్షసుడికి( Loch Ness monster ) నిలయం.

టియాంచి సరస్సులోని జీవికి “టియాంచి మాన్‌స్టర్ “( Tianchi Monster ) అని పేరు పెట్టారు.అయితే టియాంచి మాన్‌స్టర్ గుర్తింపు మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది, ఇదేంటో తెలుసుకోవాలని చాలామంది ఆసక్తిగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube