వారానికి 2 రోజులు డ్రై డే పకడ్బందీ గా చేపట్టాలిడ్రై డే కార్యక్రమ క్షేత్ర పరిశీలనలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Collector Anurag Jayanti ) రాజన్న సిరిసిల్ల జిల్లా :ఏ ఇంట్లో వర్షపు నీరు,మంచినీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలనీజిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పంచాయితీ, వైద్య ఆరోగ్య శాఖ క్షేత్ర సిబ్బందికి సూచించారు.మంచి నీరు లోనే డెంగ్యూ దోమలు వృద్ధి చెందుతాయనీ అన్నారు.
మంగళవారం డ్రై డే ను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ తంగల్లపల్లి రాళ్ల పేట గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య తనిఖీలు చేశారు.గ్రామంలోని ఇండ్లను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఇండ్లలో, ఇంటి అవరణలో నీరు నిల్వ ఉందా?నిల్వ నీటిలో లార్వా ఉన్నది, లేనిది పరిశీలించారు.ఇంటింటికి తిరిగి ఇంట్లో, పరిసరాలను పరిశీలిస్తూ, నీటి నిల్వలను తొలగిస్తూ ప్రజలకు కలెక్టర్ అవగాహన కల్పించారు.
మిషన్ భగీరథ నీరు వస్తుందా?చెత్త సేకరణ వాహనం రోజూ మీ ఇంటికి వస్తుందా?మీ ఇంట్లో ఎవరికైనా చికెన్ గున్యా, డెంగ్యూ జ్వరాలు వచ్చాయా ? అంటూ ప్రజలను ప్రశ్నించారు.
ఈ సందర్భగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….
ప్రతి మంగళ వారం, శుక్రవారం డ్రై డే తప్పనిసరిగా నిర్వహిస్తూ.ప్రతి ఇంట్లో ఉన్న నీటి నిల్వలు లేకుండా ఫ్రైడే.
డ్రైడే పాటించాలని చెప్పారు.ఇండ్లలో మంచి నీరు నిల్వకుండా చూడాలన్నారు.
మంచి నీటిలోనే డెంగ్యూ దోమలు వృద్ధి చెందుతాయని అన్నారు.వారానికి 2 సార్లు డ్రై డే చేపడితే దోమలు వృద్ధి చెందకుండా , దోమ కాటు రాకుండా నియంత్రించవచ్చని అన్నారు .పరిశుభ్రమైన ఆహారం, తాగు నీటిని మాత్రమే ఈ వర్షాకాలం తీసుకోవాలని సూచించారు.నిర్లక్ష్యం చేస్తే దోమలు కుట్టి డెంగ్యూ వస్తే చాలా కష్టమని, ఆర్థికంగా నష్టపోవడంతో పాటు, ప్రాణహాని ఉంటుందని ఆయన తెలిపారు.
డ్రై డే( Dry Day ) లో భాగంగా ప్రతి మంగళ, శుక్రవారం సెక్రెటరీ లు, ఏఎన్ఎం లు, ఆశా లు ఇంటింటికి తిరుగుతూ.పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యం, కీటక జనిత వ్యాధుల వల్ల కలిగే నష్టాలను వివరించి చైతన్యం చేయాలన్నారు.
ఇండ్లలో మంచి నీరు నిల్వ ఉంటే వాటిని పారబోయాలన్నారు.రోడ్ల కు ఇరు వైపులా డ్రైన్ లలో నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందకుండా ద్రావణం పిచికారి చేయాలన్నారు.
ఉపయోగంలోనీ బావుల్లో నీరు ఉంటే ఆయిల్ బాల్ లు వేయాలన్నారు.ఒకవేళ ఎవరికైనా డెంగ్యూ( Dengue ) పాజిటివ్ వచ్చినట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు సమాచారం అందించాలని చెప్పారు.
వారి ఇంటిలోని అందరికి, చుట్టుపక్కల వారికి పరీక్షలు చేయాలని ఆయన అన్నారు.ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టి, లార్వాలను గుర్తించి నిర్మూలించాలని ఆయన తెలిపారు.లార్వా ఉన్న చోట యాంటీ లార్వా ఆపరేషన్ చేపట్టాలన్నారు.పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, నీటి నిల్వలు లేకుండా చేసుకోవాలని, ఆయిల్ బాల్స్ వేయించాలని, దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోవాలని చెప్పారు.
రెండు వారాలకు ఒక్కసారైనా ప్రతి ఇంటినీ సందర్శించేలా ప్లాన్ చేసుకోవాలన్నారు.వర్షాకాలం ముగిసే వరకూ ఇదే విధంగా చేయాలన్నారు.
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, జాగ్రత్తలు పాటిస్తూ కాపాడుకోవాలని ఆయన సూచించారు.