ఇపుడు ఎక్కడ విన్నా చంద్రయాన్-3( Chandrayaan-3 ) గురించే చర్చ.అంతర్జాతీయంగా కూడా ఇదే విషయంపైన డిబేట్ నడుస్తోంది.
అవును, ప్రపంచ దేశాలు ఇపుడు భారతదేశం వైపు చూస్తున్నాయి.ఇక చంద్రయాన్ 3 ప్రయోగం ఎంత సక్సెస్ అయ్యిందో తెలియంది కాదు.
చంద్రయాన్ 3 ప్రయోగం తరువాత సగటు భారతీయులుగా మనం స్పేస్ క్రాఫ్ట్ చిత్రాలు, వీడియోలు, ప్రయోగం చిత్రాలు, ఇస్రో ( ISRO ) విడుదల చేసిన అనేక ఇతర దృశ్యాలు చూసాము, షేర్లు కూడా చేసుకుంటున్నాం.అయితే, ఈ స్పేస్ క్రాఫ్ట్ చుట్టూ బంగారు రంగులో( Gold Covering ) కవరింగ్ చూసే ఉంటారు.
ఈ క్రమంలోనే మనలో చాలామందికి గోల్డ్ ఫోయిల్‌లా కనిపించే ఈ పూత ఎందుకు ఉంటుంది? అనే అనుమానం అనేది రావడం సహజం.
ఈ నేపథ్యంలోనే దీనిపై ముంబయిలోని నెహ్రూ ప్లానిటోరియం డైరెక్టర్ అరవింద్ పరంజపే( Arvind Paranjape ) తాజాగా ఓ మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….“అచ్చం బంగారు వర్ణంలో కనిపించిన అది అస్సలు బంగారమే కాదు, అలాగని ఫోయిల్ కూడా కాదు.స్పేస్‌క్రాఫ్ట్‌లు, శాటిలైట్‌కు బంగారు రంగులో చుట్టినట్లుగా కనిపించేదాన్ని మల్టీ లేయర్ ఇన్సులేషన్(ఎంఎల్ఐ )( Multi Layer Insulation ) అని అంటారు.ఉష్ణ నిరోధంగా దీన్ని వాడడం జరుగుతుంది.ఆ ఫిల్మ్‌ను అనేక పొరలుగా చుడతారు.” అని ఆయన వివరించారు.
ఇక పైన కనిపించే పొర బంగారు రంగులో ఉన్నప్పటికీ లోపల తెలుపు, వెండి రంగుల్లోనూ పొరలు ఉంటాయని కూడా ఆయన తెలిపారు.కాగా ఈ బంగారు రంగు ఫిల్మ్‌ను పాలిస్టర్‌తో( Polyster ) తయారు చేస్తారట.దానిపైన అత్యంత పలుచని అల్యూమినియం పొర కూడా ఉంటుందని అరవింద్ చెప్పారు.స్పేస్ క్రాఫ్ట్( Space Craft ) మొత్తాన్నీ వీటితో చుట్టరని, రేడియేషన్‌కు గురైనప్పుడు పాడయ్యే అవకాశం ఉన్న భాగాలనే దీంతో కవర్ చేస్తారని ఆయన ఈ సందర్భంగా వివరించారు.
అదేవిధంగా అలాంటి సున్నిత భాగాలు ఎన్నున్నాయి అనేదాన్ని బట్టి ఎంత ఫిల్మ్ పేపర్ అవసరం అనేది ఆధారపడి ఉంటుందని కూడా చెప్పారు.అదండీ అసలు విషయం.