భారతదేశంలోని తెలుగు రాష్ట్రాలలో అత్యధిక విస్తీర్ణంలో సాగు అవుతున్న పంటలలో మిరప పంట( Chilli crop ) ఎప్పుడు అగ్రస్థానంలోనే ఉంటుంది.ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ప్రపంచంలోనే అతిపెద్ద మిర్చి యార్డుగా గుర్తింపు పొందింది.
ఏ పంట సాగు కైనా కీలకం మేలు రకం విత్తనాలే.మార్కెట్లో నకిలీ విత్తనాల( Fake seeds ) దందా నడుస్తున్న సంగతి తెలిసిందే.
కాబట్టి తెగులు నిరోధక కంపెనీ సర్టిఫైడ్ విత్తనాలను మాత్రమే ఎంచుకొని సాగు చేస్తేనే అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంటుంది.
మిరపలో మేలు రకం విత్తనాల విషయానికొస్తే.డబ్బీ, బ్యాడిగి( Dabbi, badigi ), 273,2222,2043,2544,4431,5531,5544 అనే హైబ్రిడ్ రకాలు అధిక విస్తీర్ణంలో రైతులు సాగు చేసి మంచి దిగుబడి సాధిస్తున్నారు.అయితే మిరప నారును నర్సరీలో లేదంటే పొలంలో పెంచుకోవచ్చు.
ఒక ఎకరం పొలానికి 15 వేల మొక్కలు అవసరం అవుతాయి.
మిరప పంట వేసే నేలలో పోషకాల శాతాన్ని పెంచుకోవడానికి ముందుగా పచ్చి రొట్ట ఫైర్లు వేసుకోవాలి.లేదంటే ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు వేసి కలియదున్నాలి.పొలంలో నారు పెంచుకోవడానికి ముందు నేలను కొంచెం ఎత్తులో మట్టిని బేడ్లు గా చేసుకోవాలి.
బెడ్ల నాలుగు మూలలు సమాన ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.విత్తనాల మధ్య ఒక అంగుళం దూరం ఉండేటట్లు నారు పోసుకోవాలి.
నారు మొక్కలకి ఎండ తగలకుండా నీడ కోసం జాలి పరదా లేదా వస్త్రాన్ని టెంటు లాగా ఏర్పాటు చేయాలి.నారు పోసిన 30 రోజుల తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి.
ప్రధాన పొలంలో మొక్కల మధ్య,మొక్కల వరుసల మధ్య సూర్యరశ్మి, గాలి బాగా తగిలే విధంగా కాస్త దూరంగా నాటుకోవాలి. మిరప పంట నాటిన 20 రోజుల లోపు ఒక ఎకరం పొలానికి 100 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 45 కిలోల పొటాష్ ఎరువులను అందించాలి.
ఎప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు చేపట్టాలి.ఏవైనా చీడపీడలు లేదా తెగుళ్లు పంటను ఆశిస్తే తొలి దశలోనే నివారణ చర్యలు చేపడితే అధిక దిగుబడి సాధించవచ్చ
.