విజయ్ ను ఫాలో అవుతున్న విశ్వక్.. ఏ విషయంలో అంటే?

టాలీవుడ్ రౌడీ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ.ఈయన అర్జున్ రెడ్డి( Arjun Reddy ) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పూర్తిగా తన స్టైల్ అండ్ మ్యానరిజాన్ని మార్చేశాడు.

 Vishwak Sen Follows Vijay Deverakonda, , Vishwak Sen, Gangs Of Godavari, , Vija-TeluguStop.com

యంగ్ హీరోస్ లో తనదైన స్టైల్ తో మెప్పిస్తూ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాడు.ఈయన అందుకే అతి కొద్దీ సమయంలోనే తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ తో స్టార్ గా ఎదిగాడు.

ఇక విజయ్ తర్వాత అలాంటి మ్యానరిజం తోనే యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.విశ్వక్( Vishwak Sen ) విభిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా కొన్ని వివాదాలతో కూడా ఫేమస్ అయ్యాడు.మరి ఈ యంగ్ హీరోస్ మధ్య కొన్ని పోలికలు ఉంటాయని అందరు అంటుంటారు.

ఇక ఇప్పుడు విశ్వక్ సేన్ ఒక విషయంలో విజయ్ ను ఫాలో అవుతున్నాడు అనే ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతుంది.దీంతో ఈ ఇద్దరి హీరోలపై ఒక టాక్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.ఇటీవలే విజయ్ ప్రజెంట్ నటిస్తున్న ‘ఖుషి( Khushi Movie )’ మూవీ కోసం హీరోయిన్ సమంతతో కలిసి లైవ్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి స్టేజ్ మీదనే రొమాన్స్ తో ఆకట్టు కున్నారు.

ఇక ఇప్పుడు విశ్వక్ సేన్ కూడా తన కొత్త సినిమా ప్రమోషన్స్ భాగంలో ఇదే మాదిరిగా స్టేజ్ మీద డాన్స్ చేసి ఆకట్టు కున్నాడు.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఫస్ట్ సింగిల్ లాంచ్ ఈవెంట్ జరుగగా ఇందులో విశ్వక్ సేన్ హీరోయిన్ నేహా శెట్టి( Neha Shetty )తో కలిసి రొమాంటిక్ డాన్స్ చేసాడు.

మరి ఈ విషయంలో విజయ్ దేవరకొండను విశ్వక్ ఫాలో అవుతున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube