కన్నడ సినిమా( Kannada movie ) ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను చాటుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్( Directed Prashant Neel )… ఈయన కేజిఎఫ్ సినిమాతో ఒకసారిగా పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటుకున్నాడు.నిజానికైతే ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది.
అందులోనూ ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులందరిలో ఎక్కడ లేని సంతోశం అయితే కనిపిస్తుంది.మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన కథ, స్క్రీన్ ప్లే ను అందించిన భగీర సినిమా( Bhagira movie ) దీపావళి కానుక గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని ఈరోజు రిలీజ్ చేశారు.ముఖ్యంగా ఈ ట్రైలర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ నిండిపోవడమే కాకుండా గత సినిమాలు ఎలాగైతే ఉన్నాయో అలాంటి ఒక మూడ్ ను క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు.ఇక మొత్తానికైతే ఈ సినిమా ఒక గుడ్ అటెంప్ట్ గా మిగలబోతుందా లేదా అనేది ఈ నెల 31వ తేదీన తెలియబోతుంది.ఇక హోం బలే పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తో ప్రశాంత్ నీల్ మరొకసారి సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ప్రశాంత్ నీల్ మొదటి సినిమా అయినా ఉగ్రమ్ సినిమాతో హీరోగా పరిచయమైన శ్రీమురళిని ఇందులో హీరోగా పెట్టి ఈ సినిమాను చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాకు తన గత చిత్రాల మాదిరిగానే మరోసారి పెను ప్రభంజలను సృష్టిస్తుందంటూ ప్రశాంత్ నీల్ భారీ నమ్మకంతో ఉన్నాడు.అయితే రాక్షసులను చంపే భఘీర రూపంలో హీరో దర్శనం ఇవ్వబోతున్నట్టుగా మనకు ట్రైలర్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.అలాగే కేజిఎఫ్ లో ఎలాగైతే చిన్న పిల్లోడికి అమ్మకి మధ్య మంచి బాండింగ్ ను చూపిస్తూ ఎమోషన్ ను పండించాడో అలాగే ఈ సినిమాలో కూడా మరోసారి అదే ఎమోషన్ ని పండించడానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది…
.