ప్రస్తుతం టాలీవుడ్ ( Tollywood )లో తెరకెక్కుతున్న కొన్ని సినిమాలు సినిమా ప్రేక్షకులను ఆకాశంలో విహరించేలా చేస్తున్నాయి.ఇప్పటికే ఆయా సినిమాల నుండి రిలీజ్ అయిన టీజర్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆయా సినిమాల పైన అంచనాలను పెంచేస్తున్నాయి.
దాదాపు అన్ని సినిమాల్లోని హీరోలందరూ మాస్ హీరోలు కావడం చేత, ఇక మాస్ జాతరలే అంటూ ఫ్రాన్స్ పండగ చేసుకుంటున్నారు.అందులో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ( Megastar Chiranjeevi, Nandamuri Balakrishna )సినిమాలో ఉండటం విశేషం.

నందమూరి బాలకృష్ణ – బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న నాలుగువ చిత్రం అఖండ 2( Akhanda2 ).తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ చూపరులను అలరిస్తోంది.మరీ ముఖ్యంగా నందమూరి అభిమానులు బాలయ్య, బోయపాటి కాంబో తెలిసిన వెంటనే సంబరాల్లో మునిగిపోయారు.నాలుగవసారి కూడా ఈ కాంబో సూపర్ డూపర్ హిట్ ఇవ్వబోతోందని కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా( Vishwambhara ) టీజర్ తాజాగా రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ టీజర్ గ్రాఫిక్స్ చూసిన సాధారణ జనాలు అంత బాగోలేదు అని చెబుతున్నప్పటికీ, ఒక వర్గం వారు మాత్రం ఈ సినిమా టీజర్ బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సినిమా టీజర్, ట్రైలర్ ఎలా ఉన్నా… సినిమా విడుదల తర్వాత కాసుల వర్షం కురిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ కోవకే చెందుతాయి… వరుణ్ తేజ్ నటించిన మట్కా( Matka ), సాయి తేజ నటిస్తున్న సినిమాలు.ఇద్దరు మెగా హీరోలు కావడం చేత ఇప్పటికే ఈ సినిమాల పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మట్కా సినిమా టీజర్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది.
ఈ టీజర్ చూసిన సాధారణ జనాలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.ఈ సినిమా వరుణ్ తేజ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలవబోతోందని జోష్యం చెబుతున్నారు.
ఇక పేరు పెట్టని సాయి తేజ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఊర మాస్ అప్పీరెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది.చాలా గ్యాప్ తర్వాత సాయి తేజ్ చేస్తున్న ఈ సినిమా పైన చాలా అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమా కోసం సాయి ధర్మ తేజ్, సాయి దుర్గ తేజ్ గా పేరు మార్చుకోవడం ప్రత్యేకతను సంతరించుకుంది.ఫస్ట్ లుక్ లో సాయి దుర్గ తేజ ఫోటో చూసిన మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.