అవును, మీరు విన్నది నిజమే.అరగంట వ్యవధిలో ప్రముఖ కొరియో గ్రాఫర్ ప్రభు దేవా ( Choreographer Prabhu Deva )ఆ పాటకి కొరియోగ్రఫీ చేసి, ఏకంగా నేషనల్ అవార్డు కొట్టేసాడు.
ఇటీవలి ఓ మీడియా వేదికగా ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రభు దేవా చాలా ఆసక్తి కరమైన విషయాల గురించి చెప్పుకొచ్చాడు.బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ ( Hrithik Roshan )నటించిన లక్ష్య సినిమా మీకు గుర్తుండే ఉంటుంది.
ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.ఇక ఈ సినిమాలోని పాటల కోసం ప్రభు దేవా డేట్స్ ని ఒక సంవత్సరం ముందుగానే బుక్ చేశారట మూవీ మేకర్స్.
ఇక ఈ సినిమాలోని ‘మై ఐసా క్యున్ హూన్’ ( My Aisa Kyun Hoon )పాటని మర్చిపోవడం అంత తేలికకాదు.మరీ ముఖ్యంగా ఇందులోని హృతిక్ రోషన్ వేసిన స్టెప్స్ అయితే న భూతో న భవిష్యతి.

ఈ పాటకి గాను ఆ సంవత్సరం ఉత్తమ కొరియోగ్రఫీ కేటగిరిలో కొరియోగ్రర్ ప్రభు దేవా జాతీయ చలన చిత్ర అవార్డును అందుకున్నాడు.అయితే ఈ పాట కోసం ప్రభు టీమ్ కేవలం ఒక అర గంటలో మొత్తం కొరియోగ్రఫీని పూర్తి చేసిందట.ఇదే విషయాన్ని ప్రభు దేవా తాజాగా ఓ మీడియా వేదికగా పంచుకోవడం విశేషతని సంతరించుకుంది.హృతిక్ రోషన్, ప్రభు దేవా ఆలోచనలకు తగ్గట్టు వేసిన స్టెప్స్ అయితే ఇప్పటికీ కుర్రకారుని ఆశ్చర్యపరుస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఈ పాటకోసం శంకర్ మహదేవన్ ( Shankar Mahadevan )కంపోజిషన్ కూడా చాలా బాగా పండింది… ఓ మాయ చేశారనే చెప్పుకోవచ్చు.

ఇక సగటు సాధారణ సినిమా ప్రేక్షకుడు నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది మాత్రం నిజం.కేవలం అరగంట వ్యవధిలో ఈ పాటకి కొరియోగ్రఫీ చేసింది ప్రభు దేవా టీమ్.ఇక లక్ష్య సినిమాకి అప్పట్లోనే ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రఫీని నిపుణుడు క్రిస్టోఫర్ పాప్ పనిచేయడం హాట్ టాపిక్ అయింది.
ప్రభుదేవా అతనితో పని చేయడం కూడా తనకు ఒక ప్రత్యేకమైన అనుభవం అని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.ఇక హృతిక్ రోషన్ చేసిన ఉత్తమ నృత్య ప్రదర్శనలలో ‘మెయిన్ ఐసా క్యున్ హూన్’ ఒకటిగా పరిగణించబడుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.