రాజన్న సిరిసిల్ల జిల్లా: లీడ్ బ్యాంక్ (యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), బ్యాంక్ ఆఫ్ బరోడా కనగర్తి శాఖ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.iఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనిల్( Village Sarpanch Anil ), ఉప సర్పంచ్ కిషన్, బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ విష్ణు కుమార్, లీడ్ బ్యాంక్ కౌన్సెలర్ వెంకట రమణ, రైతులు, స్వయం సహాయక సంఘాలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
లీడ్ బ్యాంక్ కౌన్సెలర్ వెంకట రమణ మాట్లాడుతూ పొదుపు, బీమా, పెన్షన్ ప్రాముఖ్యత గురించి ప్రసంగించారు.ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన మరియు అటల్ పెన్షన్ యోజన గురించి వివరించారు.
పంట రుణాలను సకాలంలో రెన్యూవల్ చేయాలని రైతులను కోరారు.ఆన్లైన్ మోసాల గురించి తెలియజేసి, సున్నితమైన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని కోరారు.
అనంతరం బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ విష్ణు కుమార్ ఆరోగ్య బీమా యొక్క ప్రాముఖ్యత, బ్యాంకు ఖాతాలలో నామినీ వివరాలను అప్డేట్ చేయడం గురించి మాట్లాడారు.గ్రామ సర్పంచ్ అనిల్ మాట్లాడుతూ సామాజిక భద్రత పథకాల్లో చేరాలని, పంట రుణాలు రెన్యూవల్ చేయాలని కోరారు.