రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి తను చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలకు గత నెల 31న ఢిల్లీలో జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా శుక్రవారం నేవూరి వెంకట్ రెడ్డి ని పవర్ యూత్ సభ్యులు పూల బుకే అందించి శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా పవర్ యూత్ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలోనే కాకుండా మండలం జిల్లా వ్యాప్తంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న వెంకన్నకు అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
సామాజిక సేవారంగంలో వెంకట్ రెడ్డి మరింత ముందుకు పోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పవర్ యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.