రాజన్న సిరిసిల్ల జిల్లా : నేవూరి రెడ్డి సంక్షేమ (మాలీస్ పటేండ్ల) సంఘం ఆధ్వర్యంలో సంఘ భవనంలో జాతీయస్థాయిలో సామాజిక సేవా కార్యకర్త అవార్డు( డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెక్టార్ జనపథ్ ఢిల్లీ అవార్డును అందుకున్న ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతి సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ని సంఘం సభ్యులు పూలమాలవేసి శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.
ఈ అవార్డు అందుకోవడం ఎల్లారెడ్డిపేట ప్రజలకు గర్వకారణంగా ఉందని అన్నారు.మున్ముందు ఇంకా ఎన్నో అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి,సహాయ కార్యదర్శి, కోశాధికారి, సంఘం సభ్యులు,నేవూరి రెడ్డి సంక్షేమ సంఘం మాలీస్ పటేండ్లు పాల్గొన్నారు.