స్థానిక సంస్థల్లో ఖాళీలకు ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.220 సర్పంచ్ లు, 94 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ మరియు 5,364 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉందని పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేసింది.ఈ క్రమంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలిపేందుకు ప్రభుత్వం కోర్టును గడువు కోరింది.ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వరదల నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నందున ఏజీ హైకోర్టును మూడు వారాల సమయం కోరారు.
దీంతో తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.