మామూలుగా సినిమా ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలకు హీరో హీరోయిన్ లకు కొన్ని రకాల సెంటిమెంట్లు ఉంటాయి.ఆ సెంటిమెంట్లను ఫాలో అవడం వల్ల సినిమా నుంచి సక్సెస్ సాధించడం లాంటివి జరుగుతూ ఉంటాయి.
ముఖ్యంగా దర్శక నిర్మాతలు ఈ విషయంలో మాత్రం తప్పకుండా పాటిస్తారని చెప్పవచ్చు.అలా దర్శకుడు త్రివిక్రమ్‌కు కూడా ఇలాంటి సెంటిమెంట్ వుంది.
అదే ఇళ్ల సెంటిమెంట్.చాలా సినిమాల్లో ఒక ఇంటి సెట్ ఉండాల్సిందే.
ఇది విషయం గురించి ఇండస్ట్రీలో కూడా ఒక కామెంట్ కూడా వినిపిస్తూ వుంటుంది.
త్రివిక్రమ్( Trivikram ) కథ రాయడం మొదలుపెడుతూనే ఆర్ట్ డైరక్టర్‌ను పిలిచి ఒక ఇంటి సెట్ వేసేయమంటారట.అది నిజమే అనిపిస్తుంది.అతడు సినిమాలో నాజర్ ఇల్లు కీలకం.
చాలా వరకు సినిమా అక్కడే జరుగుతుంది.అలాగే జల్సాలో( Jalsa movie ) కింద పవన్ మీద ఇలియానా వుండే ఇల్లు సెట్ కీలకంగా వుంటుంది.
ఆ ప్రదేశంలో చాలా సన్నివేశాలను తెరకెక్కించారు.అల్లు అర్జున్ నటించిన జులై సినిమాలో రాజేంద్రప్రసాద్ ఇల్లు కీలకము.
అలాగే అత్తారింటికి దారేది సినిమాలో రావు రమేష్, నదియాల ఇల్లు కీలకం.అందులో చాలా సన్నివేశాలు నడిచేది అక్కడే.
సన్నాఫ్ సత్యమూర్తిలో ఉపేంద్ర ఇంట్లో కథ కీలకంగా నడుస్తుంది.
అ.ఆ సినిమాలో నితిన్ ఇంటికి సమంత మారిన తరువాత కథ అంతా అక్కడే నడుస్తుంది.పవన్ అజ్ఙాతవాసిలో కొంచెం డిఫరెంట్ గా చేద్దామనేమో.
ఇంటికి బదులు ఆఫీసు ను వాడారు.కానీ అది కాస్తా యాంటీ సెంటిమెంట్ అయిపోయింది.
అరవిందసమేత సినిమాలో హీరోయిన్ ఇల్లు వుండనే వుంది.బన్నీ అల వైకుంఠపురములో( Ala Vaikunthapurramuloo ) టైటిల్ నే హీరో ఇంటి మీద.సినిమా అంతా అక్కడే నడుస్తుంది.మొత్తం మీద త్రివిక్రమ్ పుణ్యమా అని ఆర్ట్ చూపెడుతున్నారు.
డైరక్టర్లు రకరకాల ఇళ్ల సెట్‌లు వేసి చూపిస్తున్నారు.ప్రతి ఇల్లు యూనిక్ గా వుంటూ, సినిమాలను చూసేలా చేస్తున్నాయి.