డిమాండ్ ఉంది కాబట్టే పోటీ పడుతున్నారట?

గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీపై మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది.సంక్షేమ పథకాల పేరిట కొన్ని వర్గాలకు డబ్బును ట్రాన్స్ఫర్ చేయడమే తప్ప, రహదారుల నిర్మాణంలో కానీ, మౌలిక సదుపాయాల కల్పనలో కానీ, ఉద్యోగితా శాతాన్ని పెంచడంలో కానీ పారిశ్రామిక అభివృద్ధిలో కాన్ని ఇలా అన్ని రంగాలలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం( Andhra Pradesh Govt) విఫలమైనదని ప్రజలు ప్రభుత్వంపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు వైసీపీను ఓడిస్తారంటూ వైసీపీ వ్యతిరేక మీడియాలో విపరీతమైన కథనాలు వస్తున్నాయి.

 Huge Demand For Ycp Tickets, Ycp Tickets, Ap Politics , Tdp, Andhra Pradesh Govt-TeluguStop.com

అంతేకాకుండా మంత్రుల అవినీతిపై అనేక వరుస కథనాలు ప్రధాన మీడియా ప్రచారం చేస్తుంది.

Telugu Andhra Pradesh, Ap, Jana Sena, Pawan Kalyan, Tadepall, Ycp Tickets, Ysjag

దీనిని బట్టి చూస్తే ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కష్టమనేంత వాతావరణంలో మీడియా క్రియేట్ చేస్తుంది.అయితే గ్రౌండ్ లెవెల్ లో ఆ పార్టీకి నిజం గా అంత వ్యతిరేకత ఉన్నదా అని చూస్తే ఆ పార్టీ టికెట్లు పై పోటీ చేయడానికి నేతలు పోటీ పడుతున్నారు.దాదాపు 50 నియోజకవర్గాలలో వై సిపి టికెట్ కోసం తీవ్రస్థాయి పోటీ ఉన్నదని , పార్టీ టికెట్ ఇవ్వకపోతే రెబల్ అభ్యర్థులు ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు .ఇప్పటికే గన్నవరం రామచంద్రాపురం నియోజకవర్గాలలో టికెట్లు కోసం సొంత పార్టీల నేతల మధ్య విపరీతమైన గొడవలు జరుగుతున్నాయి.అనదికారకంగా చాలా నియోజకవర్గాలలో వైసీపీ టికెట్ల కోసం తీవ్రమైన డిమాండ్ ఉందని అధిష్టానం పై టికెట్టు కేటాయింపుల కోసం ఒత్తిడి పెంచడానికి అభ్యర్థులు తాడేపల్లికి( Tadepall ) క్యూ కడుతున్నారని వార్తలు వస్తున్నాయి.

Telugu Andhra Pradesh, Ap, Jana Sena, Pawan Kalyan, Tadepall, Ycp Tickets, Ysjag

దీనిని బట్టి అధికార పార్టీ గెలుపు పై విశ్వాసంతోనే ఈ డిమాండ్ ఏర్పడిందని ఎల్లో మీడియా సృష్టిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత అంతా అవాస్తవమని అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు .నిజంగా పార్టీ గెలుపు పై నమ్మకం లేకపోతే కోట్ల రూపాయలు ఖర్చుపెట్టడానికి అభ్యర్థులు ఎందుకు సిద్ధమవుతారు అన్నది ఈ నేతల ప్రశ్న.అయితే రాజకీయాలు వ్యాపారమయంగా మారిపోయిన ప్రస్తుత సమాజంలో వ్యక్తిగత చరిష్మా చూపించైనా గెలవాలని కోరుకుంటున్న అభ్యర్థులు మాత్రమే టికెట్ల కోసం పోటీ పడుతున్నారని గెలిస్తే తమ ప్రయోజనాలు చూసుకోవడానికి మాత్రమే వైసీపీ టికెట్( YCP ) కోసం పోటీ పడుతున్నారు తప్ప వాస్తవానికి వైసిపి పార్టీ పరిస్థితి ఏమి బాగా లేదని కూడా తెలుగుదేశం నేతల నుంచి కౌంటర్ లు పడుతున్నాయట .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube