వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండగా ఒడిశా, వెస్ట్ బెంగాల్ మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.
దీని ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురువనున్నాయని వాతావరణ హెచ్చరిక కేంద్రం తెలిపింది.అదేవిధంగా ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
కోస్తా వెంబడి సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.