'కారు ' దిగేస్తున్న ' తీగల' ! అసంతృప్తి వెనుక ఇంత స్టోరీ ఉందా ? 

ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్( Telangana congress )లోకి చేరికలు జోరందుకున్నాయి.బీఆర్ఎస్ , బిజెపిలలోని అసంతృప్తి నేతలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.

 Tegala Krishnareddy Meet Revanth Reddy , Tegala Krishnareddy, Brs Party, Telanga-TeluguStop.com

  కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ కాంగ్రెస్ లో స్పష్టంగా కనిపిస్తోంది.కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే అభిప్రాయంతో బీఆర్ఎస్, బీజేపిలలోని  కీలక నాయకులు చూపు కాంగ్రెస్ పై పడింది.

ఎమ్మెల్యే టికెట్ తమకు దక్కే అవకాశం లేదు అనుకున్న నాయకులంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు .ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి బలమైన నేతలు బీఆర్ఎస్ లో చేరారు.ఇక జూపల్లి కృష్ణారావు త్వరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నారు.ఇక రేపు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అసంతృప్త నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు.ఆ లిస్టులో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఉన్నారు.

Telugu Brs, Revanth Reddy, Sabitha Indra, Tegala Krishna, Telangana Cm, Telangan

 ఇప్పటికే తీగల కృష్ణారెడ్డి( Tegala krishnareddy ) కాంగ్రెస్ లో చేరేందుకు ముందుగా కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యరావు టాక్రే,  తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో విడివిడిగా చర్చలు జరిపారు.సీటు విషయంలో హామీ దక్కడంతో కృష్ణారెడ్డి తో పాటు, ఆయన కోడలు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు సమాచారం.అయితే ఈ విషయాన్ని అధికారికంగా తీగల కృష్ణారెడ్డి ధ్రువీకరించనప్పటికీ , ఆయన కాంగ్రెస్ లో చేరడం మాత్రం ఖాయం అన్న ప్రచారం జరుగుతోంది.

అయితే తీగల బీఆర్ఎస్ ను వీడడానికి కారణాలు చాలానే ఉన్నాయట.ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( sabitha indrareddy ) బీఆర్ఎస్ లో కీలకంగా ఉండడం,  వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి పోటీ చేసే అవకాశం ఉండడం,  తనకు టికెట్ విషయమై కేసీఆర్ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతోనే కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకోవడానికి కారణంగా తెలుస్తోంది.

Telugu Brs, Revanth Reddy, Sabitha Indra, Tegala Krishna, Telangana Cm, Telangan

 అయితే చాలాకాలంగా బీఆర్ఎస్ అధిష్టానం వైఖరి పై తీగల అసంతృప్తితోనే ఉన్నారు .ముఖ్యంగా సబిత బీఆర్ఎస్ లో చేరిన తరువాత ఆమెకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ ఉండడం, తమను పట్టించుకోకపోవడం, ఇప్పుడు టిక్కెట్ దక్కే అవకాశం లేకపోవడం తదితర కారణాలతోనే ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకోవడానికి కారణమట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube