బాలయ్య కాదనుకున్న సినిమా నాగార్జున కి భారీ హిట్టిచ్చీంది...

ఒక హీరో చెయ్యాల్సిన సినిమా మరో హీరో చెయ్యడం,అది హిట్ లేదా ఫ్లాప్ అవ్వడం అనేది మన టాలీవుడ్ లో కొత్తేమి కాదు.దశాబ్దాల నుండి ఇలా జరుగుతూనే ఉంది, ఆ తర్వాత కొద్దిరోజుల తర్వాత ఎవరో ఒకరి ద్వారా పలానా సూపర్ హిట్ సినిమాని మీ హీరో మిస్ అయ్యాడు అని తెలియడం , సదరు హీరో అభిమాని అయ్యో అవునా ఎలాంటి సినిమాని మిస్ అయ్యాడు మా హీరో అని ఫీల్ అవ్వడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం…

 How Balakrishna Missed Nagarjuna Sivamani Movie Details, Balayya , Balakrishna ,-TeluguStop.com

అలా నందమూరి బాలయ్య( Balakrishna ) విషయం లో కూడా ఒకటి జరిగింది అట.

అసలు విషయం లోకి వెళ్తే మాస్ హీరోయిజం కి సరికొత్త నిర్వచనం తెలిపిన ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్( Director Puri Jagannath ) గతం లో బాలయ్య తో ఒక సినిమా చెయ్యాలని అనుకున్నాడట.కానీ బాలయ్య కి ఎందుకో ఆ చిత్రం సబ్జెక్టు నచ్చక రిజెక్ట్ చేసాడట.

 How Balakrishna Missed Nagarjuna Sivamani Movie Details, Balayya , Balakrishna ,-TeluguStop.com

ఆ సినిమా మరేదో కాదు, అక్కినేని నాగార్జున( Nagarjuna ) హీరో గా నటించిన శివమణి చిత్రం.( Sivamani Movie ) ఈ సినిమాలోకి నాగార్జున లోని నట విశ్వరూపం మొత్తం బయటపెట్టాడు పూరి జగన్నాథ్.నాగార్జున అంతకు ముందు కూడా మాస్ సినిమాలు చేసాడు కానీ, క్యారక్టర్ పరంగా ఇంత డిఫరెంట్ గా మాత్రం చెయ్యడం అదే తొలిసారి…

Telugu Balakrishna, Balayya, Puri Jagannath, Nagarjuna, Paisa Vasool, Sivamani,

ఫ్యాన్స్ నాగార్జున ని ఆ యాంగిల్ లో చూసి ఎంతో మురిసిపోయారు.డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై అప్పట్లో అక్కినేని ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపించారు.అయితే ఈ సినిమాని ముందుగా బాలయ్య తో చెయ్యాలి అనుకున్నాడట పూరి జగన్నాథ్.బాలయ్య కి ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది కానీ, సెకండ్ హాఫ్ కి మరియు ఫస్ట్ హాఫ్ కి అసలు సంబంధమే లేనట్టుగా అనిపిస్తుంది, ఇది వర్కౌట్ అవ్వదేమో అని అన్నాడట.

నాకు నమ్మకం లేదు ఈ సినిమా మీద, ఏమనుకోకు వేరే కథ చేద్దాం అని అన్నాడట.

Telugu Balakrishna, Balayya, Puri Jagannath, Nagarjuna, Paisa Vasool, Sivamani,

ఆ తర్వాత పూరి జగన్నాథ్ అక్కినేని నాగార్జున ని కలిసి ఈ కథ వినిపించడం, ఆయన వెంటనే ఓకే చెప్పి ఈ సినిమా చెయ్యడం, అది సూపర్ హిట్ అవ్వడం అన్నీ అలా అలా జరిగిపోయాయి…అయితే ఆ తర్వాత బాలయ్య పూరి కాంబో లో పైసా వసూల్ కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశనే మిగిల్చింది…ఇక ప్రస్తుతపు విషయానికి వస్తే నాగార్జున కి కార్లు అంటే చాలా ఇష్టం ఏ కొత్త కార్ వచ్చిన కొనేస్తాడు అందుకని తన కార్ కలెక్షన్ ఖాతాలోకి మరో కొత్త కారును చేర్చాడు, అదే కియా ఈవి6. ఈ కారును తన ఇంటివద్దే డెలివరీ తీసుకున్నాడు నాగార్జున.అమల కోసం గిఫ్టుగా కొన్నాడు అని అనుకుంటున్నారు అక్కినేని అభిమానులు.

మరికొందరు అయితే నాగ చైతన్య లానే తండ్రి నాగార్జునకు కూడా కారులు అంటే పిచ్చి అని అనుకుంటున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube