మీ ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని( Laughing Buddha statue ) ఉంచుకోవడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.అయితే ఇది అలంకార ప్రాయం కాదని దీంతో శుభాలు కూడా కలుగుతాయని నమ్ముతారు.
దీన్ని ఇంట్లో పెట్టుకోవాలంటే సరైన దిశలో ఉంచుకోవాలి.ఇలా సరైన దిశలో ఉంచితేనే మంచి లాభాలు కలుగుతాయి.
ఒకవేళ సరైన దిశలో లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.జపాన్ నివాసి అయిన హోతాయ్( Hotai ) బౌధ్ధ మతాన్ని అనుసరించాడు.
తపస్సు చేయడం వలన జ్ఞానోదయం పొందాడు.ఇక అన్ని తెలుసుకున్న తర్వాత ఆయన బాగా నవ్వాడు.
జీవితంలో ప్రజలను నవ్వించడానికి పనిచేస్తానని అప్పటినుంచి నిర్ణయించుకున్నాడు.దీంతో హోతాయ్ అనేక దేశాలు తిరిగాడు.

ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజలను నవ్విస్తూ ఉండేవాడు.ప్రజల్లో ఆనందాన్ని నింపాలి అనుకున్నాడు.అందుకే ఆయనను లాఫింగ్ బుద్ధ అనే పేరు వచ్చింది.అందుకే లాఫింగ్ బుద్ధును సంతోషానికి చిహ్నంగా చెబుతారు.ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచుకోవడం వలన ఇంట్లో ఆనందం, సంపద( Happiness, wealth ) వస్తుందని నమ్ముతారు.ఇంట్లో నెగటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
దీంతో ఇంట్లో సుఖసంతోషాలు వెలివేరుస్తాయి.అందుకే ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంచుకోవాలని కోరుకుంటారు.
అయితే లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఏ దిశలో ఉంచుకోవాలనే దానిపై అవగాహన తప్పక ఉండాలి.లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉంచుకుంటే చాలా మంచిది.

అలాగే తూర్పు వైపున లాఫింగ్ బుద్ధ పెట్టడం మంచిది.అంతేకాకుండా పిల్లల స్టడీ రూమ్ లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెడితే పిల్లల మనసుపై సానుకూలతో కలుగుతుంది.అంతేకాకుండా ఆఫీసు డిస్క్ పై పెట్టుకున్న కూడా చాలా మంచిది.వ్యాపార స్థలాల్లో లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే వ్యాపారం క్రమంగా పెరిగిపోతుంది.అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం( Vastu Shastra ) బంగారు నాణేలు మోస్తున్న లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంచుకుంటే చాలా మంచిది.ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు రాకుండా ఉంటాయి.
ఇక బంగారు రంగులో ఉండే లాఫింగ్ బుద్ధ మరింత మంచి ఫలితాలను ఇస్తుంది.అయితే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని నేలపై ఉంచకూడదని గుర్తుంచుకోవాలి.
LATEST NEWS - TELUGU