చంద్రబాబు మొన్న అసెంబ్లీ నుంచి వెళ్తూ ఓ సంచలన శపథం చేశారు.తాను ముఖ్యమంత్రిని అయిన తర్వాతే అసెంబ్లీకి వస్తానని, అప్పటి వరకు రాబోనంటూ ప్రకటించేశారు.
దీంతో అందరూ ఆయన ఇక అసెంబ్లీకి రారనే అనుకుంటున్నారు.ఎందుకంటే అసెంబ్లీలో చంద్రబాబు ఫ్యామిలీని అవమానించారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.
ఇలాంటి అవమానం జరిగిన తర్వాత ఆయన ఎలా వస్తారనే అంతా అనుకుంటున్నారు.కానీ జగన్ దెబ్బకు ఆయన ఇప్పుడు రావాల్సి వస్తోంది.
జగన్ మూడు రాజదానులపై సంచలన ప్రకటన చేసేశారు.మూడు రాజధానుల బిల్లులను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించేశారు.అయితే త్వరలోనే మరో బిల్లుతో సభ ముందుకు వస్తామని కూడా తెలిపారు.సీఆర్డీఏ చట్టాన్ని వెనక్కు తీసుకుంటూనే మరో కొత్త బిల్లును తీసుకొస్తామని చెప్పడంతో చంద్రబాబు రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఎందుకంటే కొత్త బిల్లులు అసెంబ్లీకి వస్తే కచ్చితంగా ప్రతిపక్ష నేతగా చంద్రబాబు రావాలి.పైగా ఆయన గతంలో శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానికి సంబంధించిన కీలక బిల్లు కాబట్టి కచ్చితంగా రావాలి.

ఆయన గతంలో ఎందుకోసం అక్కడే రాజధానిని ఏర్పాటు చేయాల్సి వచ్చిందో చెప్పాల్సి ఉంటుంది.కొత్త బిల్లుల మీద ప్రజల తరఫున, రాజధాని రైతుల తరఫున వాయిస్ వినిపించాలి.జగన్ కూడా అతి తొందరలోనే బిల్లులు తెచ్చే అవకాశం ఉంది.
ఎందుకంటే ఎన్నికలకు రెండున్నరేండ్లు మాత్రమే ఉంది కాబట్టి ఆలోపు రాజధాని బిల్లులు తెచ్చి పనులు కూడా చేయించాల్సి ఉంది.ఈ క్రమంలో కొత్త బిల్లులు అతి తొందరలోనే వస్తాయని చెబుతున్నారు.
ఇలా చంద్రబాబు మళ్లీ అసెంబ్లీకి వచ్చే సన్నివేశాన్ని తెప్పించారు జగన్.మరి చంద్రబాబు వస్తారా లేక టీడీపీ నేతలను పంపించి ఊరుకుంటారా అన్నది మాత్రం వేచి చూడాలి.