అంజూరా పంటను( Fig crop ) సాగు చేస్తే లాభాలే తప్ప నష్టం అనే మాటనే ఉండదు.ఇటీవలే వ్యవసాయ రంగంలో చీడపీడల బెడద( Pest infestation ), వివిధ రకాల తెగుళ్ల కారణంగా అనవసర రసాయన ఎరువులు, పిచికారి మందులు వాడుతూ రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలిసిందే.
వ్యవసాయం చేసే ప్రతి రైతు పెట్టుబడి తక్కువగా ఉండి, దిగుబడి అధికంగా వచ్చే పంటలను పండించడానికి ఆసక్తి చూపిస్తారు.
కాబట్టి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులకు అంజూరా పంట సాగు ఎంతో ఆసరాగా ఉంటుంది.మార్కెట్లో ఒక కిలో డ్రై అంజూరా రూ.800 వరకు ధర పలుకుతుంది.పైగా ఈ డ్రై అంజూరా ఫ్రూట్ ను మార్కెటింగ్ చేయడానికి పెద్దగా ఇబ్బంది కూడా ఉండదు.కాబట్టి రైతులు ఈ అంజూరా పంటను సాగు చేసి అధిక లాభాలు గడించవచ్చు.
ఈ అంజూరా పంట సాగు కు ఎంత ఖర్చవుతుంది.సాగు ఎలా చేయాలో అనే వివరాలు పూర్తిగా చూద్దాం.ఒక ఎకరం విస్తీర్ణంలో ఈ పంట సాగు చేయడానికి మొక్కలకు రూ.20000 ఖర్చు అవుతుంది.ఇక ఎరువులు, కూలీల ఖర్చు దాదాపుగా రూ.50వేల వరకు ఖర్చు అవుతుంది.అంటే ఒక ఎకరం పంట సాగు చేయాలంటే సుమారుగా రూ.70 వేలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
ఈ మొక్కల మధ్య 8 అడుగుల దూరం, సాళ్ల మధ్య 14 అడుగుల దూరం ఉండేటట్లు ఒక ఎకరం పొలంలో 500 మొక్కలను నాటుకోవాలి.అప్పుడు ఒక్కొక్క మొక్క ధర దాదాపుగా రూ.40 రూపాయలు.ఇక అధిక ప్రాధాన్యత సేంద్రీయ ఎరువులకే ఇవ్వాలి.
మొక్కలు నాటిన ఎనిమిది నెలలకు పంట చేతికి వస్తుంది.ఒక ఎకరానికి 7 టన్నుల వరకు దిగుబడి పొందవచ్చు.ఒక కిలో రూ.100 రూపాయలకు అమ్మవచ్చు.ఇక అధిక ఉష్ణోగ్రత ఉంటే దిగుబడి కూడా అధికంగానే ఉంటుంది.కాబట్టి నవంబర్, డిసెంబర్ నెలలో కటింగ్ చేస్తే మార్చి వరకు దిగుబడి అధికంగా పొందవచ్చు.