పెళ్లి అంటే చాలు.ప్రతిఒక్కరికీ హుషార్ వచ్చేస్తుంది.
పెళ్లి ఫంక్షన్( Wedding function ) లో హంగామా మాములుగా ఉండదు.బంధుమిత్రుల రాకతో సందడి నెలకొంటూ ఉంటుంది.
పెళ్లి అనగానే నెల ముందు నుంచే హడావుడి మొదలైపోతుంది.షాపింగ్ కే చాలా టైమ్ పడుతూ ఉంటుంది.
అలాగే పెళ్లి మండపం డిజైన్, ఫొటోగ్రాఫర్లను( Design , photographers ) ఏర్పాట్లు చేసుకోవడం, విందు మెనూ సెలక్ట్ చేసుకోవడం లాంటివి చాలా ఉంటాయి.ఇక పెళ్లిలో డ్యాన్స్ లు, పాటలతో చేసే హడావుడి మామాలుగా ఉండదు.
పెళ్లి బరాత్‌తో వధూవరులతో పాటు అతిధులు డ్యాన్స్ వేస్తూ సందడి చేస్తూ ఉంటారు.దీంతో పెళ్లి బరాత్‌కు( wedding baraath ) సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తూ ఉంటాయి.తాజగా పెళ్లి బరాత్ కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోలో పెళ్లి ఊరేగింపులో ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం కూలర్లు ఏర్పాటు చేశారు, ఏకంగా 11 కూలర్లను ఏర్పాటు చేశారు.
పెళ్లి ఊరేగింపుతో పాటు ఈ కూలర్లను వాహనాల్లో తీసుకొచ్చారు.
సోషల్ మీడియలో వైరల్ అవుతున్న ఈ వీడియో 13 సెకన్ల పాటు ఉంది.ఇందులో ఊరేగింపుగా వెళ్లేటప్పుడు బ్యాండ్ బాజాతో పాటు లైట్ల వెలుతురులో కూలర్లు కూడా కనిపిస్తున్నాయి.ఊరేగింపుగా వెళ్లేటప్పుడు ఎండ తగలకుండా చల్లటి వాతావరణంలో డ్యాన్స్ వేయడానికి వీటిని ఏర్పాటు చేశారు.
ఈ వీడియో మధ్యప్రదేశ్ లోని ఇండరోలో జరిగిన ఒక పెళ్లి వీడియోగా తెలుస్తోంది.ఇండోర్‌లోని రాజ్ బాదా ప్రాంతానికి చెందిన ఒక హోటల్ యజమాని తన పెళ్లికి వచ్చిన అతిధులకు ఇలా కూలర్లు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి.దీంతో ఎండ తీవ్రత నుంచి రక్షణ కల్పించేందుకు వీటిని ఏర్పాటు చేశారు.