కళ్లు లేకపోయినా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న విద్యార్థిని.. అవమానించిన వాళ్లే ఔరా అనేలా?

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలన్నా ఎంతో కష్టపడాలనే సంగతి తెలిసిందే.రేయింబవళ్లు శ్రమిస్తే మాత్రమే ఫస్ట్ ర్యాంక్ సొంతమవుతుంది.

 Hannah Alice Saimon Success Story Details Here Goes Viral In Social Media Detail-TeluguStop.com

అయితే ఒక విద్యార్థిని మాత్రం కంటిచూపు లేకపోయినా ఫస్ట్ ర్యాంక్ సాధించడం గమనార్హం.పుట్టుకతోనే కంటిచూపును కోల్పోయిన హన్నా ఆలిస్ సైమన్( Hannah alice saimon ) గతేడాది విడుదలైన ఇంటర్ సీ.

బీ.ఎస్.ఈ పరీక్ష ఫలితాలలో( CBSE exam ) తన ప్రతిభతో సత్తా చాటారు.

500 మార్కులకు 496 మార్కులను ఆమె సొంతం చేసుకున్నారు.దివ్యాంగుల కేటగిరీలో ఆమె ఫస్ట్ ర్యాంక్( She ranks first in the disabled category ) సాధించడం గమనార్హం.ఈ విద్యార్థిని పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగగా ఈ విద్యార్థిని టాలెంట్ కు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.

ప్రతిభ ఉంటే కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం కష్టం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఫస్ట్ ర్యాంక్ సాధించడం గురించి ఈ విద్యార్థిని మాట్లాడుతూ పేరెంట్స్ వల్లే నేను ఈ స్థాయిలో సక్సెస్ అయ్యానని అమె చెప్పుకొచ్చారు.

Telugu General Telugu, Psychology, Hannah Saimon, Ranksdisabled-Latest News - Te

నాకు కళ్లు లేకపోయినా నేను నార్మల్ స్కూల్ లో చదువుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.నేను జీవితంలో ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయని ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని హన్నా ఆలిస్ సైమన్ అన్నారు.ఒక అరుదైన వ్యాధి వల్ల తాను కంటిచూపును కోల్పోయానని ఆమె చెప్పుకొచ్చారు.వైకల్యం ఉన్నా పట్టుదలతో కెరీర్ పరంగా సక్సెస్ సాధించవచ్చని ఈమె ప్రూవ్ చేశారు.

ప్రస్తుతం హన్నా ఆలిస్ సైమన్ అమెరికాలో స్కాలర్ షిప్ తో సైకాలజీలో గ్రాడ్యుయేషన్ ను చదువుతున్నారు.నేను ఎల్లప్పుడూ దేవుడిని, ప్రణాళికలను నమ్ముతానని ఆమె చెప్పుకొచ్చారు.

నేను సాధారణ విద్యార్థులతో పోటీ పడుతున్నానని హన్నా ఆలిస్ సైమన్ పేర్కొన్నారు.ఆమె వెల్లడించిన విషయాలు ఎంతోమందిలో స్పూర్తిని నింపుతున్నాయి.

అవమానించిన వాళ్లే ఔరా అనేలా హన్నా కెరీర్ పరంగా ఎదిగారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube