కేంద్రంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ( BJP ) వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తోంది.మేనియా ఈసారి ఎన్నికల్లో కూడా గట్టిగా పని చేస్తుందని కచ్చితంగా ఈసారి కూడా అధికారంలోకి వచ్చేది తామే అని బల్లగుద్ది చెబుతున్నారు కమలనాథులు.
అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే రాష్ట్రల వారీగా ఆ పార్టీ ప్రభావం గట్టిగా ఉండాలి.ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీకి మంచి ఆధారణ ఉన్నప్పటికి దక్షిణాది రాష్ట్రాలలో ఆ పార్టీ ఉనికే లేదు.
కాగా ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణల దృష్ట్యా చూస్తే ఉత్తరాదిన కూడా బీజేపీ బలహీన పడుతూ వస్తోందనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట.ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆయా రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ” లైఫ్ అండ్ డెత్ ” గా మారాయి.
కర్నాటక ఎన్నికల్లో( Karnataka elections ) విజయం మాదే అని జబ్బలు చరిచిన బీజేపీకి చుక్కెదురైంది.దాంతో రాబోయే అయిదు నెలల్లో మరో ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలను బట్టి బీజేపీ భవిష్యత్ డిసైడ్ అవుతుందనేది విశ్లేషకులు చెబుతున్నా మాట.ఈ ఏడాది చివర్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్తాన్ ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో బీజేపీ ఏమాత్రం సత్తా చాటలేకపోయిన ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై గట్టిగా పడుతుంది.ప్రస్తుతం ఈ ఐదు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులను గమనిస్తే.బీజేపీ ఏ ఒక్క రాష్ట్రంలోనూ సత్తా చాటే పరిస్థితులు లేవు.
తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభావం గట్టిగా ఉంటుంది.ఇక రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ అత్యంత పటిష్టంగా ఉంది.మధ్యప్రదేశ్ లో ఎన్నికల రీత్యా కాంగ్రెసే గెలిచినప్పటికి పిరాయింపుల కారణంగా బీజేపీ అధికారంలో కొనసాగుతోంది.
ఇక మిజోరాం నేషనల్ ఫ్రంట్ అధికారంలో కొనసాగుతోంది.ఆ విధంగా చూస్తే ఈ ఐదు రాష్ట్రాల్లో కూడా బీజేపీ గెలిచే పరిస్థితులు చాలా తక్కువ అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక ఒకవేళ ఈ ఐదు రాష్ట్రాలలో బిజెపీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన విపక్షాలు బలం పెంచుకొని మోడీ సర్కార్ కు కొరకరాని కొయ్యాలా మారే అవకాశం ఉంది.మరి కాషాయ పార్టీకి ” లైఫ్ అండ్ డెత్ ” గా మారిన ఆ ఐదు రాష్ట్రాలలో బిజెపీకి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.