జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త తెలియజేయడం జరిగింది.వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఇందుకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం కేసీఆర్ ఆదేశించారు.ఇదే సమయంలో విధివిధానాల కమిటీకి సంబంధించి మొదట జిల్లాల వారీగా కమిటీ… అనంతరం రాష్ట్రస్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి తెలియజేయడం జరిగింది.
జిల్లా స్థాయిలో కమిటీలు కలెక్టర్ల ఆధ్వర్యంలో వేయాలని సూచించారు.ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్, జిల్లా ఫారెస్ట్ అధికారి, జిల్లా ఎస్పీ లేదా డీసీపీ మెంబర్లుగా ఉండాలని స్పష్టం చేశారు.
దీనికి రాష్ట్రస్థాయి నుంచి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడి స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరించాలని సూచించారు.రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.ఈ క్రమంలో జిల్లా స్థాయి కమిటీ ద్వారా పంపించినటువంటి ప్రతిపాదనను… రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలిస్తుందని స్పష్టం చేశారు.అనంతరం రాష్ట్రస్థాయి కమిటీ చీఫ్ సెక్రటరీకి నివేదిక పంపిస్తుందని పేర్కొన్నారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమను క్రమబద్ధీకరించాలని గత కొంతకాలంగా సమ్మె చేస్తున్నారు.మొదటిగా ప్రభుత్వం వీరికి హెచ్చరిక జారీ చేసింది.
వెంటనే విధుల్లో చేరాలని స్పష్టం చేసింది.ఈ క్రమంలో కొంతమంది మాత్రమే విధుల్లో చేరారు.
తర్వాత కొద్ది రోజులు సమ్మె చేసి మిగతా వారు కూడా విధుల్లో చేరారు.ఇటువంటి పరిస్థితులలో క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల జూనియర్ పంచాయతీ కార్యదర్శులు.
సంతోషం వ్యక్తం చేస్తున్నారు.