టీడీపీ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు.ఎంపీ టికెట్ లేకుంటే కేశినేని భవన్ నుంచి ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు.
జీవితాంతం రాజకీయాల్లో ఉండాలని భావించే వ్యక్తిని కాదని కేశినేని పేర్కొన్నారు.మంచి పనులను చేసిన వారిని అభినందిస్తానని స్పష్టం చేశారు.
బెజవాడకు ఎవరు మంచి చేస్తే వారితో కలుస్తానని చెప్పారు.ఎంపీగా ఉన్న తాను పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి చేయాలంటే స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు సహకరించాలని తెలిపారు.