తాజాగా బెంగళూరు – గుజరాత్( RCB vs GT ) మధ్య జరిగిన మ్యాచ్ లో సొంత వేదికపై బెంగుళూరు( RCB ) ఘోర ఓటమిని చవిచూసి ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించింది.కీలక మ్యాచ్లో బెంగుళూరు జట్టు కొంప ముంచేశాడు గిల్.
మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.విరాట్ కోహ్లీ( Virat kohli ) సెంచరీతో అదరగొట్టాడు.
తర్వాత 198 పరుగుల లక్ష్య చేదనకు దిగిన గుజరాత్ జట్టు ఘనవిజయం సాధించి బెంగుళూరు జట్టును ఇంటికి పంపించింది.గుజరాత్ జట్టు ఓపెనర్ శుబ్ మన్ గిల్( Shubman Gill ) 52 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్ లతో 104 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.
ఈ ఐపిఎల్ సీజన్ లో శుబ్ మన్ గిల్ రెండవ సెంచరీ నమోదు చేసుకున్నాడు.ఇంతకుముందు హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 101 పరుగులతో మొదటి సెంచరీ అందుకున్నాడు.
ఇక క్వాలిఫైయర్ వన్ లో గుజరాత్ జట్టు చెన్నైతో తలపడనుంది.ఇక విరాట్ ను ఓడించి, ధోనితో తాడోపేడో తేల్చుకోనుంది గుజరాత్.గిల్ ఫామ్ లో ఉండడం గుజరాత్ జట్టుకు మంచి శుభ పరిమాణం అని చెప్పాలి.ఇక గుజరాత్- చెన్నై మధ్య మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగనుంది.
తాజాగా జరిగిన మ్యాచ్లో విజయం అనంతరం గిల్ మాట్లాడుతూ.క్వాలిఫైయర్ వన్ లో కచ్చితంగా గెలిచి ఫైనల్ కు వెళ్తామని ధీమా వ్యక్తం చేశాడు.
చెన్నై వేదికగా జరిగే మ్యాచ్లో చెన్నై పై విజయం సాధించి రెండోసారి ఫైనల్ కు తప్పకుండా చేరుకుంటామని తెలిపారు.ప్రస్తుతం గిల్ ఫామ్ చూస్తుంటే చెన్నై జట్టును కూడా ఇంటికి పంపించేలా ఉన్నాడు.చెన్నై జట్టు ఫైనల్ కు వెళ్లాలంటే గిల్, మిల్లర్, విజయ్ శంకర్ లకు అధిక పరుగులు చేసే అవకాశం ఇవ్వకుండా తొందరగా అవుట్ చేయాలి.