మిల్కీ బ్యూటీ తమన్నా( Tamannaah Bhatia ) టాలీవుడ్ లో ఇప్పటికీ తన హవా కొనసాగిస్తూనే ఉంది.కొత్త హీరోయిన్స్ ఎంతమంది వస్తున్నా సరే తమన్నా మాత్రం తన సత్తా చాటుతూనే వస్తుంది.
వెంకటేష్( Venkatesh ) లాంటి సీనియర్ హీరోతో నటిస్తూనే సత్యదేవ్ లాంటి యంగ్ హీరోలతో కూడా జోడీ కట్టింది.అయితే ఇదివరకు ఉన్నంత దూకుడుగా కెరీర్ లేదన్న మాట వాస్తవమే కానీ< తమన్నా కు ఇప్పటికీ తెలుగులో ఆఫర్లు వస్తున్నాయి.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్( Bhola Shankar ) సినిమాలో నటిస్తుంది తమన్నా.ఆ సినిమా తర్వాత మరో సినిమా కోసం వెయిటింగ్ తప్పేలా లేదు.
అయితే తనకు ఎక్కడ ఛాన్స్ లు రాకుండా వెళ్తాయో అని తమన్నా లీడ్ హీరోయిన్ మాత్రమే కాదు ఎలాంటి పాత్రలైనా సరే ఓకే అనేస్తుందట.అంతేకాదు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే స్పెషల్ సాంగ్స్( Special Songs ) చేసిన తమన్నా ఇప్పుడు కెరీర్ అటు ఇటుగా ఉన్న టైం లో కూడా తమన్నా ఇటెం సాంగ్స్ కి రెడీ అంటుంది.
అయితే స్టార్ హీరోయిన్స్ కూడా ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు.అందుకే తమన్నా దాకా ఆ ఆఫర్లు రావట్లేదు.
అయితే తమన్నా చేస్తానంటే యంగ్ హీరోల సినిమాలకు ఆమె సాంగ్ స్పెషల్ క్రేజ్ తెస్తుందని చెప్పొచ్చు.