అలా ఉండటం అమ్మని చూసి నేర్చుకున్నా... మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్!

నేడు మదర్స్ డే (Mothers Day) కావడంతో ప్రతి ఒక్కరు వారు మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ క్రమంలోని సెలబ్రిటీలు సైతం వారి అమ్మలతో వారికి ఉన్నటువంటి అనుబంధం గురించి తెలియజేస్తూ వారి తల్లులకు మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 I Learned To Be Like That From My Mother Megastar Chiranjeevi's Post Went Viral-TeluguStop.com

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సైతం తన తల్లి అంజనాదేవి(Anjana Devi) కి, ఈ ప్రపంచంలోనే మాతృమూర్తులందరికీ ప్రత్యేకంగా మదర్స్ డే శుభాకాంక్షలు చెబుతూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ సందర్భంగా చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ …

అనురాగం మమకారం ఈ రెండింటికి అర్థమే అమ్మ.అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం.నిరాడంబరంగా ఉండటం మేమంతా అమ్మని చూసి నేర్చుకున్నాం.

అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే అంటూ ఈ సందర్భంగా చిరంజీవి తన తల్లితో వారికి ఉన్న అనుబంధం గురించి తల్లిపై తనకు ఉన్నటువంటి ప్రేమ గురించి తెలియజేస్తూ తన తల్లితో కలిసి దిగిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకులముందుకు వచ్చిన చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

మెహర్ రమేష్(Meher Ramesh) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా (Tamannaah)హీరోయిన్గా నటించగా ఇందులో కీర్తి సురేష్(Keerthi Suresh) చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో చిరుతో కలిసే శ్రేయ(Shriya) సందడి చేయబోతున్నారని తెలుస్తోంది.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube