అలా ఉండటం అమ్మని చూసి నేర్చుకున్నా… మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్!
TeluguStop.com
నేడు మదర్స్ డే (Mothers Day) కావడంతో ప్రతి ఒక్కరు వారు మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోని సెలబ్రిటీలు సైతం వారి అమ్మలతో వారికి ఉన్నటువంటి అనుబంధం గురించి తెలియజేస్తూ వారి తల్లులకు మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సైతం తన తల్లి అంజనాదేవి(Anjana Devi) కి, ఈ ప్రపంచంలోనే మాతృమూర్తులందరికీ ప్రత్యేకంగా మదర్స్ డే శుభాకాంక్షలు చెబుతూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ . """/" /
అనురాగం మమకారం ఈ రెండింటికి అర్థమే అమ్మ.
అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం.నిరాడంబరంగా ఉండటం మేమంతా అమ్మని చూసి నేర్చుకున్నాం.
అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే అంటూ ఈ సందర్భంగా చిరంజీవి తన తల్లితో వారికి ఉన్న అనుబంధం గురించి తల్లిపై తనకు ఉన్నటువంటి ప్రేమ గురించి తెలియజేస్తూ తన తల్లితో కలిసి దిగిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకులముందుకు వచ్చిన చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
"""/" /
మెహర్ రమేష్(Meher Ramesh) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా (Tamannaah)హీరోయిన్గా నటించగా ఇందులో కీర్తి సురేష్(Keerthi Suresh) చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో చిరుతో కలిసే శ్రేయ(Shriya) సందడి చేయబోతున్నారని తెలుస్తోంది.
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
యూకే పార్లమెంట్లో భారత సంతతి నేత ప్రీతి పటేల్‌కు కీలక పదవి