తెలుగు సినిమా ప్రేక్షకులకు దర్శకుడు పూరి జగన్నాథ్( Puri Jagannadh ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి ఎంతో మంది హీరోలను స్టార్స్ గా నిలబెట్టారు పూజ జగన్నాథ్.
అతి తక్కువ సమయంలోనే సినిమాలను తెరకెక్కించి మంచి మంచి హిట్ లను అందుకున్నారు పూరి జగన్నాథ్.బద్రి సినిమాతో మొదలై ఇస్మార్ట్ శంకర్ వరకు ఎన్నో మంచి మంచి సినిమాలను తెరకెక్కించారు.
కానీ లైగర్ సినిమా విషయంలో మాత్రం కాస్త ఎదురు దెబ్బ తగిలింది.ప్రస్తుతం పూరి జగన్నాథ్ కాస్త గ్యాప్ తీసుకున్నారు.
ఇది ఇలా ఉంటే చాలాకాలం తర్వాత పూరి జగన్నాథ్ తన ఫ్యామిలీతో కలిసి కనిపించారు.సొంత ఊరిలో తన కుటుంబ సభ్యులందరితో కలిసి నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు పూరి జగన్నాథ్.ఈ సందర్భంగా భార్య లావణ్య, పూరి జగన్నాథ్ తో కలిసి హోమాన్ని ఆచరించారు.కొడుకు ఆకాష్ పూరి,( Akash Puri ) కూతురు పవిత్రతో కలిసి హోమంలో పాల్గొన్నారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఆ ఫోటోలపై టాలీవుడ్ నటుడు నిర్మాత బండ్ల గణేష్( Bandla Ganesh ) స్పందించారు.
పూరీ తన భార్యను హగ్ చేసుకున్న ఫొటోలను, వారి కుటుంబ సభ్యుల ఫొటోలను ట్వీటర్ లో షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చాడు.
మిమ్మల్ని ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది అన్నా, వదిన అంటూ ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఆ ట్వీట్ కూడా వైరల్ గా మారింది.ఆ పోస్ట్ పై కూడా నేటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఇకపోతే పూరీ జగన్నాథ్ విషయానికి వస్తే.లైగర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ఎక్కువగా చార్మితో కలిసి కనిపించడంతో చార్మితో అఫైర్ నడుపుతున్నాడని తన భార్య లావణ్య కు విడాకులు ఇస్తున్నాడు అంటూ కూడా వార్తలు జోరుగా వినిపించాయి.
ఆ విషయంపై కొడుకు ఆకాష్ పూరి స్పందిస్తూ అవన్నీ అబద్ధాలే అని చెప్పినప్పటికీ నేటిజన్స్ మాత్రం ఆ వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూనే వచ్చారు.తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలతో ఆ వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది.