300 అడుగుల ఎత్తులో జలపాతాలు.. వాటిపై నుంచి జారిన వ్యక్తి.. వీడియో వైరల్!

ప్రపంచంలో రెండు వర్గాల ప్రజలు ఉంటారు.వారిలో ఒకరు పిరికివారైతే, మరికొందరు డేర్ డెవిల్స్.

 Waterfalls At A Height Of 300 Feet.. A Person Slipped From Them Video Viral! Da-TeluguStop.com

పిరికివారు ఏ పని చేయాలన్నా భయపడతారు.అదే డేర్ డెవిల్స్ ఎంతకైనా తెగిస్తారు.

ప్రాణాలు పోతాయని తెలిసినా ఒళ్లు గగుర్పొడిచే స్టంట్స్ కూడా చేస్తారు.అలాంటి వారిలో ఫ్రీస్టైల్, వైట్ వాటర్ కయాకింగ్ ఛాంపియన్ అయిన డేన్ జాక్సన్ ఒకరు.

ఈ వ్యక్తి తాజాగా 300 అడుగుల ఎత్తు ఉన్న జలపాతం పైనుంచి కయాకింగ్ చేశాడు.సాధారణంగా 100 అడుగుల ఎత్తు పైనుంచి కిందకి చూస్తేనే గుండె జల్లుమంటుంది.

అలాంటిది ఏకంగా 300 అడుగుల ఎత్తు నుంచి ఈ డేర్ డెవిల్ పడవతో జారుతూ వావ్ అనిపించాడు.ఈ అరుదైన ఫీట్‌కి సంబంధించి ఒక వీడియో కూడా వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే. మెక్సికో( Mexico )లోని శాంటో డొమింగో జార్జ్‌లో వరుస జలపాతాలు ఉన్నాయి.వీటి ఎత్తు దాదాపు 300 అడుగులు.నిజానికి ఈ వరుస జలపాతాలు నాలుగు విభాగాలు ఉంటాయి.కాగా ఏంజెల్ వింగ్స్( Angel Wings ) అనే జలపాతం పైనుంచి జారటం చాలా రిస్కీ గా ఉంటుంది ఎందుకంటే దీని ఎత్తు దాదాపు 80 అడుగుల ఉంటుంది.ఈ 80 అడుగులు కూడా నిలువుగా ఉంటాయి.

దీని పైనుంచి కింద పడేటప్పుడు గుండె జారిపోవడం ఖాయం.కానీ జాక్సన్( Dane Jackson ) ఏ మాత్రం భయపడలేదు ఈ ఫీట్‌ చేయడానికి అతడు ముందు నుంచే బాగా ప్రిపేర్ అయ్యాడు.

అతని బృందం చాలా రోజులుగా జలపాతాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించింది.నీటి స్థాయిలను తనిఖీ చేసింది.ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే కాపాడేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.కాగా జాక్సన్ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జలపాతాల పైన నుంచి విజయవంతంగా కయాకింగ్ చేశాడు.తన జీవితంలో ఇంత వేగమైన, ప్రాణాంతకమైన కయాకింగ్ చేయలేదంటూ మీడియాతో జాక్సన్ తెలిపారు.ఇంత పెద్ద రిస్క్ చేసిన ఎలాంటి గాయాలు కాకుండా బయటపడటం మరో విశేషం అంటూ తన ఫీట్ గురించి సగర్వంగా చెప్పుకున్నాడు.

డేన్ జాక్సన్, అతని స్నేహితుడు బ్రెన్ ఓర్టన్ ఈ మొత్తం జలపాతాలను పూర్తి చేసిన నాల్గవ, ఐదవ వ్యక్తులుగా నిలిచారు.ఇకపోతే కయాకింగ్ అంటే కయాక్ అని పిలిచే ఒక చిన్న బోట్ ఉపయోగించి ఆడే ఒక వాటర్ స్పోర్ట్స్.

ఈ ఆట ఆడేవారు డబుల్ బ్లేడెడ్ తెడ్డుతో ముందుకు సాగుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube