వైరల్: చదువు కోసం ప్రతిరోజూ నదిని దాటుతున్న చిన్నారి... నెటిజన్ల ప్రశంసలు!

సోషల్ మీడియా( Social media )లో నిత్యం అనేకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.కొన్ని చాలా ఫన్నీగా అనిపిస్తే, మరికొన్ని చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి.

 Viral: The Child Crossing The River Every Day To Study. Netizens Praise! Kids T-TeluguStop.com

కొన్ని చాలా సిల్లీగా అనిపిస్తే కొన్ని అత్యంత జుగుప్సను కలిగిస్తూ ఉంటాయి.అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని చూస్తే మీరు చాలా ఇన్స్పైరింగ్ అవుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఎందుకంటే చుట్టూ ఎన్నో సౌకర్యాలు ఉండికూడా కొంతమందికి చదువు మీద శ్రద్ధ రావడంలేదు.ఇటువంటి తరుణంలో ఓ యువతి చదువుకోసం ఏకంగా నదిని దాటడం ఇపుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

అవును, నేటి ప్రపంచం ఎంతో పురోగతిని సాధించిందని మనం చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నాం.అయితే ఇలాంటి నాటిమేటి ప్రపంచంలో కూడా ఎక్కడో ఒకచోట స్కూలికి వెళ్ళడానికి విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారంటే మనది అభివృద్ధా? అని ఒక్కోసారి మనలో మనం ప్రశ్నవేసుకోక తప్పదు.ఐతే అలాంటి క్లిష్ట పరిస్థితులలో కూడా ఎంతో నిబద్ధతతో వారు చదువుకి వెళ్లడాన్ని చూస్తుంటే సలాం చేయకుండా ఉండలేము.ప్రస్తుత వీడియోలో కొంతమంది అమ్మాయిలు తమ ప్రాణాలను పణంగా పెట్టి పాఠశాలకు వెళ్లడం గమనించవచ్చు.

అవును, ఇక్కడ ఓ స్కూల్ స్టూడెంట్( Student ) నదికి ఇటువైపు నిలబడి నదిని దాటేందుకు ఒక తాడుని తీసుకుంది.ఆ తాడు సాయంతో బాలిక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నది దాటింది.ఈ చర్య నిజంగా ఎంతో సాహసంతో కూడుకుంది.

నది( River ) దాటే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలకే ప్రమాదం.ఎందుకంటే నదిలో నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంది.నదిలో పొరపాటున పడితే కొట్టుకుపోతారు.

అయితే ఈ బాలిక నదిని తాడు సాయంతో చాకచక్యంగా దాటింది.చదువు కోసం తన ప్రాణాలను ప్రమాదంలో పెట్టి మరీ వెళ్తున్న ఆ చిన్నారిని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube