భారత్ లో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,874 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.
తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం 49,015 యాక్టివ్ కేసులున్నాయి.నిన్న రోజువారీ కేసుల సంఖ్య 7,171 గా ఉందని వైద్యారోగ్య శాఖ పేర్కొంది.
ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,43,64,841 కు చేరిందని వెల్లడించింది.