వేసవికాలం వచ్చిందంటే చాలు రోడ్లమీద ఎక్కడ చూసినా మామిడి పండ్లు( Mangoes ) కుప్పలుగా కనిపిస్తూ ఉంటాయి.చాలామంది వేసవి వాతావరణంలో మామిడిపండును తినడానికి ఇష్టపడతారు.
ఇది రుచిలోనే కాకుండా ఆరోగ్యం అందించే విషయంలో కూడా ప్రత్యేకమైన స్థానంలో ఉంది.అయితే మామిడిపండు తిన్నాక కొన్ని రకాల ఆహారాలు అస్సలు తీసుకోకూడదు.
అలా తినడం వలన కొంతమందిలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.అయితే మామిడిపండు తిన్న తర్వాత కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
అయితే ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామంది పండిన మామిడిపండుని పెరుగన్నం( Curd Rice )లో కలుపుకుని తింటూ ఉంటారు.అయితే పెరుగులో మామిడిపండు ముక్కలను వేసుకొని తినడం వలన ఆరోగ్యానికి చాలా హానికరం.ఈ రెండు ఆహారాలు కలిపి తీసుకుంటే పొట్ట సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కాకరకాయను, మామిడి పండును ఒకే రోజు తక్కువ గ్యాప్ తో తీసుకోవడం మంచిది కాదు.మామిడి పండు తిన్నాక భోజనంలో కాకరకాయ తినడం వలన వికారం, వాంతులు వచ్చే అవకాశం ఉంది.
ఇక చాలామంది స్పైసి ఫుడ్( Spicy Food ) ని ఎక్కువగా ఇష్టపడతారు.అయితే స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత మామిడిపండును అస్సలు తినకూడదు.
ఇలా తింటే జీర్ణక్రియ సమస్యలు( Digestive Problems ) వచ్చే అవకాశం ఉంది.వేసవికాలంలో వేడికి చాలామంది కూల్ డ్రింక్ లు తాగుతూ ఉంటారు.అయితే సోడా లేదా శీతల పానీయాలు తాగిన తర్వాత మామిడిపండును అస్సలు తినకూడదు.ఎందుకంటే మామిడిపండులో చక్కెర నిల్వలు( Sugar Levels ) ఎక్కువగా ఉంటాయి.అదేవిధంగా సోడా, శీతల పానీయాలలో కూడా చక్కెర అధికంగా ఉంటుంది.ఇలా ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన రక్తంలో షుగర్ లెవెల్స్ అధికంగా పెరుగుతాయి.
ఇక మామిడిపండు తిన్న తర్వాత ఒక గంట వరకు నీరు కూడా అస్సలు తాగకూడదు.ఇలా తాగితే జీర్ణ వ్యవస్థకు ప్రభావితం చేస్తుంది.
దీని వలన విరేచనాలు అవుతాయి.అలాగే కడుపు ఉబ్బరంగా కూడా కనిపిస్తుంది.