అరెస్ట్ చేస్తారనే ఆందోళనలో అవినాష్ రెడ్డి ? 

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసు లో అనిత ట్విస్టులు నెలకున్నాయి .ఇప్పటికే ఈ కేసు దర్యాప్తును సిబిఐ ( CBI ) వేగవంతం చేసింది.

 Mp Avinash Reddy Worrying About His Arrest In Ys Viveka Case Details, Ys Avinash-TeluguStop.com

ముఖ్యంగా ఈ వ్యవహారంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి( Avinash Reddy ) పేరు ప్రముఖంగా వినిపిస్తుండడం, ఆరు సార్లు సిబిఐ ఆయనను విచారించడం వంటి వ్యవహారాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తుండడంతో,  ఈ వ్యవహారంపై అవినాష్ రెడ్డి ఆందోళనలో ఉన్నారు.  తనపై కుట్ర జరుగుతోందని అవినాష్ రెడ్డి వ్యాఖ్యానిస్తుండడం సంచలనం రేపుతోంది.

  నేడు హైకోర్టులో తన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి పులివెందులలో ఉన్నారు.

ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వ్యులను సుప్రీంకోర్టు రద్దు చేసింది.  సుప్రీం ఆదేశాల ఉత్తర్వులు అందితే ఈరోజు తెలంగాణ హైకోర్టులో దీనిపై విచారణ జరుగుతుంది.

న్యాయస్థానం నిర్ణయం మేరకు సిబిఐ కూడా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుండడంతో అవినాష్ రెడ్డి లో ఆందోళన పెరిగిపోతుంది.  ఇప్పటికే సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని ఆరుసార్లు విచారించారు.

అలాగే అవినాష్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు వైఎస్  వివేకా కుమార్తె సునీత ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిని సిబిఐ అధికారులు విచారించారు.

Telugu Ap Cm Jagan, Avinash Reddy, Kadapa, Supreme, Ys Vivekananda-Politics

ఇక వివేక హత్య జరిగిన రోజున దొరికిన లేఖ గురించి వారిని ఆరా తీశారు.సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్ పై వెలువడిన నిర్ణయాలతో హైకోర్టులో జరగబోయే విచారణపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన ఈరోజు విచారణ జరగబోతోంది.

ఇక సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుంచి పులివెందులకు వెళ్లారు అక్కడ క్యాంపు కార్యాలయంలోనే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు.

Telugu Ap Cm Jagan, Avinash Reddy, Kadapa, Supreme, Ys Vivekananda-Politics

మరో రెండు రోజులు పాటు పులివెందులలోనే ఆయన ఉండబోతున్నారు.ఇక తనను టార్గెట్ గా చేసుకుని సిబిఐ ముందుకు వెళ్తున్న తీరుపై అవినాష్ రెడ్డి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.  సునీత ఇస్తున్న స్టేట్మెంట్లు ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటున్నాయని,  సంఘటన జరిగిన సమయంలో లేఖ దాచిన విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి చెబుతున్నారు.

ఇక సిబిఐ అధికారులు తను అరెస్టు చేయబోతున్నారనే ప్రచారంపైన అవినాష్ రెడ్డి తీవ్ర ఆందోళనతో ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube