రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో అక్రమంగా ఇసుక డంపులను నిల్వ ఉంచారనే సమాచారంతో తంగళ్ళపల్లి ఎస్సై లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఇసుక డంపును సీజ్ చేశారు.సుమారుగా 10 ట్రాక్టర్ల ఇసుకను డంపు సీజ్ చేయడం జరిగిందన్నారు.
ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తామని ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ పరమేష్,సంపత్ రెడ్డి ఉన్నారు.