అక్కడ లోకేష్ బిజీ .. ఇక్కడ వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు 

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం( Yuva Galam ) పాదయాత్రతో బిజీగా ఉన్నారు.చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన పాదయాత్ర మొదలైంది.

 Ysrcp Political Plan In Mangalagiri Assembly Constituency , Jagan, Ysrcp, Ap,-TeluguStop.com

శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు యాత్రను చేపట్టనున్నారు.ప్రజలను ఆకట్టుకునేందుకు వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో పాటు,  సెల్ఫీ చాలెంజ్ లు విసురుతూ,  రాష్ట్రవ్యాప్తంగా తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు.

లోకేష్ పాదయాత్ర పూర్తయ్యే నాటికి ఆయన బలమైన నేతగా,  జనాల్లో ముద్ర వేయించుకుంటారని , రాబోయే ఎన్నికల్లో టిడిపికి కలిసి వస్తుందనే లెక్కల్లో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఉన్నారు.

Telugu Allaramakrishna, Jagan, Janasena, Kandru Kamala, Mangalagiri, Ysrcp-Polit

 ఒకపక్క లోకేష్ యువ గళం పాదయాత్రతో బిజీగా ఉండగానే,  ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేయబోయే మంగళగిరి నియోజకవర్గంలో వైసిపి రకరకాల ఎత్తుకడలు వేస్తోంది.అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేసేందుకు భారీగానే వ్యూహాలు పన్నుతోంది.2019 ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.ఎట్టి పరిస్థితుల్లోనైనా మంగళగిరి నుంచి మళ్లీ పోటీ చేసి గెలవాలనే పట్టుదలతో లోకేష్ ఉన్నారు.గత 25 ఏళ్లుగా మంగళగిరిలో టిడిపి గెలిచింది లేదు.అయినా లోకేష్ మంగళగిరి ని ఎంపిక చేసుకున్నారు.2014లో టిడిపికి గేలం వేసిన మంగళగిరిలో వైసిపి అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డి అక్కడ గెలుపొందారు.2019 ఎన్నికల్లోనూ ఆళ్ళ రామకృష్ణారెడ్డి లోకేష్ ప్రత్యర్థుల పోటీచేసి వైసీపీ నుంచి విజయం సాధించారు.

Telugu Allaramakrishna, Jagan, Janasena, Kandru Kamala, Mangalagiri, Ysrcp-Polit

అయితే 2024 ఎన్నికల్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి( Alla ramakrishna Reddy )ని తప్పించి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతకు టికెట్ ఇచ్చే ఆలోచనలో వైసిపి అధిష్టానం ఉంది.ఈ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో లోకేష్ పై పోటీకి అదే సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని దింపేందుకు వ్యూహాలు పన్నుతోంది.దీనిలో భాగంగానే ఆ సామాజిక వర్గంలో కీలకంగా ఉన్న నాయకులందరినీ వైసీపీలోకి తీసుకువచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఇప్పటికే బలమైన నేతలు ఎంతోమందిని చేర్చుకున్నారు.

Telugu Allaramakrishna, Jagan, Janasena, Kandru Kamala, Mangalagiri, Ysrcp-Polit

ఈ నియోజకవర్గానికి చెందిన పోతుల సునీతకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.అలాగే మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావును పార్టీలోకి తీసుకుని ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.ఇక మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల సైతం వైసీపీలోనే ఉన్నారు.

ఇక 2014లో టిడిపి నుంచి పోటీ చేసి 12 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చెంది మంగళగిరి మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన గంజి చిరంజీవిని( Ganji Chiranjeevi ) కూడా వైసిపిలో చేర్చుకున్నారు.ఆయనకు కూడా నామినేటెడ్ పదవి ఇచ్చారు.

ఇంకా నియోజకవర్గంలో టిడిపిలో యాక్టివ్ గా ఉన్న నాయకులకు వైసిపి గేలం వేస్తోంది.వారందరినీ పార్టీలో చేర్చుకుని లోకేష్ కు బలం లేకుండా చేయాలనే పట్టుదలతో వైసిపి వ్యూహాలు రచిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube