ఫోర్టిఫైడ్‌ రైస్‌ ఆరోగ్యానికి అన్ని విధాలుగా మేలు

జిల్లాలోని రేషన్‌ షాపుల్లో ఈ నెల నుంచి ఫోర్టిఫైడ్‌ రైస్‌ పంపిణీ.ఫోర్టిఫైడ్‌ రైస్‌ రక్తహీనత ను నివారిస్తుంది.రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని రేషన్‌ షాపుల్లో ఈ నెల నుంచి పంపిణీ చేస్తున్న ఫోర్టిఫైడ్‌ రైస్‌ ప్రజల ఆరోగ్యానికి అన్ని విధాలుగా మేలు చేస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ తెలిపారు.శనివారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఫోర్టిఫైడ్‌ రైస్‌ వల్ల కలిగే ప్రయోజనాలను తెలుపుతూ ముద్రించిన గోడ పత్రికలను జిల్లా అదనపు కలెక్టర్ , పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ జితేంద్ర ప్రసాద్, జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథంతో కలిసి ఆవిష్కరించారు.

 Fortified Rice Is Good For Health In All Ways , Fortified Rice, Kumrambhim Asifa-TeluguStop.com

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ…నిరుపేదల్లో రక్తహీనత, పిల్లల్లో ఎదుగుదల లోపానికి చెక్‌ పెట్టేందుకు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.ప్రజా పంపిణీలో భాగంగా వినియోగదారులకు అందిస్తున్న సాధారణ రేషన్‌ బియ్యానికి బదులు పోషకాలు గల బలవర్ధక బియ్యం (ఫోర్టిఫైడ్‌ రైస్‌) పంపిణీ నీ ఈ నెల నుంచి చేపడుతుందన్నారు.

గతేడాది నుంచే మొదటి ఫేజ్ లో కుమ్రంభీం ఆసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, ఆదిలాబాద్‌లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇవ్వగా, ఈ నెల నుంచి రాజన్న సిరిసిల్ల సహా మరో 7 జిల్లాలో రేషన్‌ షాపుల ద్వారా పేద ప్రజలకు పంపిణీ చేస్తుందన్నారు.ఫోర్టిఫైడ్‌ రైస్‌ బహిరంగ మార్కెట్ లో ఒక్కో కిలో కు రూ.65 /- ఉంటుందన్నారు.ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం ఈ మొత్తాన్ని భరించి ప్రజలకూ అందిస్తుందన్నారు.

ఫోర్టిఫైడ్‌ రైస్‌ ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లాలోని తహశీల్దార్ లకు దిశా నిర్దేశం చేశామన్నారు.గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యం చేస్తామని చెప్పారు.

అపోహలు వద్దు ఆరోగ్యకరమైన బియ్యం చూడడానికి సాధారణ బియ్యం లాగానే కనిపిస్తున్న ఫోర్టిఫైడ్‌ రైస్‌ ఆరోగ్యకరమైనదని అన్నారు.ఫోర్టిఫైడ్‌ రైస్‌ బియ్యం కడిగిటప్పుడు నీటిలో తేలడం వల్ల దీనిని తాలు, ప్లాస్టిక్ బియ్యంగా భావించి నేలపాలు చేస్తున్నారని అన్నారు.

పేద ప్రజల్లో పోషకాహారం లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వ మే ప్రతీ 100 కేజీల సాధారణ బియ్యంలో ప్రత్యేకంగా కొన్ని పోషకాలతో తయారు చేసిన కేజీ బియ్యాన్ని కలుపుతుందన్నారు.ఫోర్టిఫైడ్‌ రైస్‌ అంటే…?సాధారణంగా పండించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చే క్రమంలోఎక్కువగా పాలిష్‌ చేయడంతో నూక, తౌడు రూపంలో పోషకాలు వెల్లి పోతాయి.ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి పోషకాలు శరీరానికి అందడం లేదు.ఈ నేపథ్యంలో గర్భిణుల్లో రక్తహీనత, చి న్నారుల్లో ఎదుగుదల లేకపోవడం, వయస్సుకు తగ్గ బరువు లేక పోవడం లాంటి సమస్యలు వస్తున్నాయి.

ఇలాంటి సమస్యలకు చెక్‌పెట్టడంలో ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బీ-12 కీలకమైన పోషకాలు.సాధారణ బియ్యం పిండికి ఈ మూడింటితో చేసిన మిశ్రమాన్ని కలిపి మళ్లీ వాటిని బియ్యం గింజల మాదిరిగా తయారు చేస్తారు.

వీటిని ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్స్‌ అంటారు.ఈ విధంగా తయారు చేసిన బియ్యం గింజలను సాధారణ బియ్యంలో కలిపేస్తారు.ప్రతి క్వింటాల్‌ సాధారణ బియ్యంలో ఒక కిలో ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్స్‌ను కలుపుతారు.ఇవి సాధారణ బియ్యంలో కలిసిపోతాయి.

ఈ విధంగా ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్స్‌ కలిపిన బియ్యాన్నే బలవర్ధక బియ్యం (ఫోర్టిఫైడ్‌ రైస్‌) అంటారు.సాధారణ బియ్యం మాదిరిగానే ఫోర్టిఫైడ్‌ కెర్నల్స్‌ కూ డా ఉడుకుతాయి.

సాధారణ బియ్యానికి ఉన్న రం గు, రుచి, వాసనే ఉంటుంది.త్వరగా పాడైపోయే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు.

ఉపయోగం ఏంటి…?సాధారణ బియ్యంలో ఐరన్‌ విటమిన్‌ డి, బి–12తో పాటు మరిన్ని పోషకాలు కలపటంతో సూక్ష్మ పోషకాలతో కూడిన బియ్యంగా మారుతాయి.గోధుమలు, మినుములు, పెసర, అపరాలు, రాగులు, సజ్జలు వంటి తృణ ధాన్యాలను పొడిగా మారుస్తారు.

వీటిని కెనరల్స్‌ అంటారు.ఈ కెనరల్స్‌ పౌడర్‌ను ముద్దల రూపంలోకి మార్చి క్వింటా సాధారణ బియ్యానికి కిలో కెనరల్స్‌ కలుపుతారు.

సాధారణ బియ్యంలో కార్బొహైడ్రేట్స్‌ మాత్రమే ఉంటాయి.తోడుగా కెనరల్స్‌ కలపటంతో పిండి పదార్థాలు, పోషకాలు జమవుతాయి.

పోషకాలు కలిపిన బియ్యం వండితే బలవర్ధక ఆహారం తయారవుతుంది.రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube