ఫస్ట్ డే అదరగొట్టిన 'రావణాసుర'.. సాలిడ్ బజ్ లేకపోయినా సాలిడ్ కలెక్షన్స్!

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ అవైటెడ్ మూవీ ‘రావణాసుర’(Ravanasura).ఈ సినిమా కంటే ముందు రెండు సూపర్ హిట్స్ అందుకున్న రవితేజ ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని భావించాడు.

 Raviteja Ravanasura Box Office Collection Day 1 Details, Ravanasura, Ravi Teja,-TeluguStop.com

ఇక ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూసారు.మరి అందరి ఎదురు చూపుల మధ్య ఈ సినిమా ఏప్రిల్ 7న పాన్ ఇండియా వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి సినిమా తర్వాత వచ్చిన సినిమా అయినప్పటికీ ఈ సినిమాకు ఆ సినిమాల రేంజ్ లో సాలిడ్ బజ్ అనేది రాలేదు.కానీ ఎట్టకేలకు నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా సాలిడ్ బజ్ లేకపోయినా ఫస్ట్ డే సాలిడ్ కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది.

మొదటి రోజు ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ నే అందుకుందని మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసారు.

ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 9 కోట్లని రాబట్టినట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు.మరి ఈ ఓపెనింగ్స్ సాలిడ్ అనే చెప్పాలి.వీకెండ్ లో మరిన్ని మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

చూడాలి మాస్ రాజా హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడో లేదో.ఇక ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్, ఆర్టి టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మించారు.

ఇక ఈ సినిమాలో మాస్ రాజాకు జోడీగా ఐదుగురు హీరోయిన్స్ నటించారు.అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నాగర్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్ లు నటించగా.హర్ష వర్ధన్, భీమ్స్ సిసిరోలియా సంగీతం అందించారు.అక్కినేని హీరో సుశాంత్ ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపించి ఆకట్టు కున్నాడు.చూడాలి వీకెండ్ గడిస్తే కలెక్షన్స్ ఎలా ఉంటాయో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube