ఇండియన్ మైఖేల్ తో మెగాస్టార్.. నెట్టింట వైరల్ అవుతున్న పిక్.. విశేషమేంటంటే?

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహించడమే కాదు.వారిని అభినందించడంలో కూడా ఎప్పుడు ముందే ఉంటాడు.

 Megastar Chiranjeevi Shares Prabhu Deva Pic, Megastar Chiranjeevi, Meher Ramesh,-TeluguStop.com

మరి అటువంటి చిరు ఈ రోజు తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పిక్ కూడా షేర్ చేసారు.మరి ఆ వ్యక్తి ఎవరంటే ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న డ్యాన్సింగ్ ఐకాన్ ”ప్రభుదేవా”(Prabhu Deva).

ఈయన ఇండియన్ ప్రేక్షకులకు బాగా సుపరిచితం.మరి ఈ డ్యాన్స్ మాస్టర్ అంటే చిరుకి కూడా చాలా ఇష్టం.ఈయన గురించి పలు సందర్భాల్లో చిరు గొప్పగా చెప్పడం విన్నాం.మరి అలాంటి డ్యాన్సింగ్ ఐకాన్ కు మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ తనతో దిగిన పిక్ షేర్ చేసాడు.

ఈ పిక్ లో చిరంజీవి, ప్రభుదేవా తో పాటు మెగా డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా ఉన్నారు.

ఈ పిక్ నెట్టింట వైరల్ అయ్యింది.ఇదిలా ఉండగా ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా ‘భోళా శంకర్’(Bhola Shankar).ఈ సినిమాను మెహర్ రమేష్ (Meher Ramesh) డైరెక్ట్ చేస్తుండగా.

అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.

కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది.మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ సినిమా వేదాళం కు రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.రీమేక్ సినిమా అయినా కూడా ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 11న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు.చూడాలి వాల్తేరు వీరయ్య విజయాన్ని చిరు కంటిన్యూ చేస్తాడా లేదా?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube