మన భారతదేశంలో ఎన్నో పురాతనమైన పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు ఉన్నాయి.ఈ దేవాలయాలకు ( Temples ) ప్రతి రోజు ఎంతో మంది భక్తులు తరలి వచ్చి భగవంతుని దర్శించుకుంటూ ఉంటారు.
దాదాపు దేవాలయాలకు వచ్చిన భక్తులందరూ దేవునికి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ ఉంటారు.మరి కొంత మంది భక్తులు భగవంతునికి కానుకలను( Offerings ) సమర్పిస్తూ ఉంటారు.
మన దేశంలో ఉన్న ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క రకమైన సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి.
అలాంటి దేవాలయాలలోనే కన్న పిల్లలను( Children ) దేవునికి అమ్మేసే దేవాలయం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.
తమ కన్న పిల్లలను దేవుడికి అమ్మేసి ఆ తర్వాత డబ్బులు ఇచ్చి భక్తులు కొనుక్కుంటూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా గొల్లల మామిడాల కోదండ రామాలయంలో ప్రతి సంవత్సరం జరిగే ఈ ఆచారం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.
శ్రీరామనవమి సందర్భంగా తల్లిదండ్రులు తమ కన్న పిల్లలను ఈ దేవాలయానికి సమర్పిస్తూ ఉంటారు.ఆ తర్వాత డబ్బులు ఇచ్చి తిరిగి వారే కొనుగోలు చేస్తూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే ఇలా చేయడం ద్వారా తమకు, తమ పిల్లలకు అంతా మంచే జరుగుతుంది అని చాలా మంది భక్తులు నమ్ముతారు.1889లో నిర్మించినప్పటి నుంచి ఈ దేవాలయంలో పిల్లలను దేవునికి అమ్మేయడం అనే ఆచారం కొనసాగుతూ వస్తుందని దేవాలయ పూజారులు చెబుతున్నారు.
ఈ దేవాలయంలో తమ పిల్లలను దేవుడికి అమ్మేసి కొనుగోలు చేసే ఆచారంతో పాటు ఇతర విశిష్టతలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే సంతానం లేని వారికి ఈ దేవాలయంలో మొక్కుకుంటే శ్రీరామచంద్ర సంతాన భాగ్యం కలిగిస్తారని చాలా మంది భక్తులు విశ్వసిస్తారు.ఇంకా చెప్పాలంటే ఇక్కడ జరిగే సీతారాముల కళ్యాణం లో తలంబ్రాలతో పరమాన్నం వండుకొని తినడం భక్తులు ఆనవాయితీగా ఆచరిస్తూ వస్తున్నారు.