హిందూ సాంప్రదాయం ప్రకారం దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రాంగణంలో ఉన్న గంటను ఒకసారి లేదా మూడు సార్లు కొడతారు.అసలు గంట కొట్టడానికి కారణం మన మనసులో ఉన్న ఆందోళన తగ్గి ప్రశాంతంగా ఉండడానికి అని వేద పండితులు చెబుతున్నారు.
అంతే కాకుండా భగవంతునికి ప్రసాదాలు( God ) పెట్టి పూజించడం వల్ల మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారు.అయితే పూజల విషయంలో అన్నిటి వెనుక కొన్ని అంతర్యాలు దాగి ఉన్నాయి.
అలాగే గంటను కొడితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.మన దేశంలో ఎన్నో పురాతన పుణ్య క్షేత్రాలు, దేవాలయాలు ఉన్నాయి.
ఈ పుణ్యక్షేత్రాలకు ప్రతి రోజు ఎంతో మంది భక్తులు తరలి వచ్చి భగవంతుని దర్శించుకుంటూ ఉంటారు.మరి కొంత మంది వ్యక్తులు స్వామి వారికి అభిషేకాలు( Anointings ) పూజలు చేస్తూ ఉంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే దేవాలయానికి వచ్చినా భక్తులు కచ్చితంగా గంట కొడుతూ ఉంటారు.కొంత మంది భక్తులు గంటను ఒక సారి కొడితే మరి కొంత మంది భక్తులు గంటను చాలా సార్లు కొడుతూ ఉంటారు.
భక్తులు దేవరానికి వచ్చి గంట కొట్టడంలో కూడా ఎన్నో అర్ధాలు ఉన్నాయి.ఒక్క సారి గంట కొట్టడం వల్ల మరణానికి సంకేతం అని పురాణాలు చెబుతున్నాయి.ముఖ్యంగా చెప్పాలంటే ఒక వేళ దేవుడు ముందు రెండుసార్లు గంట మ్రోగిస్తే( bell rings ) పలు రకాలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని వేద పండితులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే మూడుసార్లు గంట కొట్టడం వల్ల సుఖశాంతులతో పాటు మంచి ఫలితాలు లభిస్తాయని వేద పండితులు చెబుతున్నారు.
అందువల్ల దేవాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మూడుసార్లు గంట మోగించడం ఎంతో మంచిది.కాబట్టి దేవాలయానికి వెళ్ళినా ప్రజలు కచ్చితంగా మూడు సార్లు గంటను మోగించడం వల్ల వారి మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది.